Ram Gopal Varma: ఆమె బిగ్ బాస్ 4 టైటిల్‌‌ విన్నర్‌ కావాలి.. రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma About Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ప్రపంచమంతా ఏమైపోతున్నా నాకెందుకు అంటూ పట్టించుకోకుండా ఉండే ఆర్జీవీ సైతం బిగ్ బాస్ ఫీవర్‌పై నోరు విప్పారు. బిగ్ బాస్ తెలుగు 4 విజేతగా అరియానా అర్హురాలు అంటూ తన మద్దతు తెలిపారు.

Last Updated : Dec 9, 2020, 08:17 PM IST
  • గ్రాండ్ ఫినాలేకు చేరుకున్న బిగ్ బాస్ 4
  • నాకు చూడాలని ఉందన్న డైరెక్టర్ వర్మ
  • తన ఫెవరెట్ ఎవరో చెప్పిన RGV
Ram Gopal Varma: ఆమె బిగ్ బాస్ 4 టైటిల్‌‌ విన్నర్‌ కావాలి.. రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma About Bigg Boss Telugu 4:  ప్రపంచమంతా ఏమైపోతున్నా నాకెందుకు అంటూ పట్టించుకోకుండా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అలాంటి వ్యక్తి బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో గురించి స్పందించాడు. పైగా తన ఫెవరెట్ కంటెస్టెంట్ అయిన అరియానాకు ఓటు వేయాలని సైతం ఆర్జీవీ కోరడం విశేషం. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. మరికొన్ని ఇంటర్వ్యూలలో అరియానా తెలివిని మెచ్చుకుంటూ వర్మ మాట్లాడిన మాటల వీడియో సైతం వైరల్ అవుతోంది.

వాస్తవానికి ఈ వారం Bigg Boss Telugu 4 ఎలిమినేషన్ నుంచి టాప్ 5 కంటెస్టెంట్స్‌లో అరియానా (Ariyana) చేరిపోతుంది. అయితే ఇప్పటివరకూ గత మూడు సీజన్లలో రెండు పర్యాయాలు.. రెండో సీజన్‌లో గీతా మాధురి, మూడో సీజన్‌లో యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. తాజాగా అరియానా గ్లోరిని బిగ్ బాస్ తెలుగు 4 విజేత (Bigg Boss Telugu 4 Title Winner)గా నిలపాలంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కోరుతున్నాడు. నాకు నేనంటే చాలా ఇష్టమని అరియానా చెబుతున్న చిన్న వీడియో క్లిప్పింగ్‌‌ను సైతం డైరెక్టర్ వర్మ షేర్ చేశాడు.

Also Read : Bigg Boss Telugu 4 Voting numbers: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్

 

తనకు బిగ్‌బాస్ షో చూడాలని ఉంటుందని, అయితే వీలు కుదరడం లేదని వర్మ చెప్పడం గమనార్హం. అయితే అరియానా బిగ్‌బాస్ తెలుగు 4 టైటిల్ విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాడు. దాంతోపాటుగా ఆమె తెలివి, యాటిట్యూట్ వెరీగుడ్ అని మెచ్చుకున్నాడు ఆర్జీవీ. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 టైటిల్ విజేతగా నిలిచేందుకు యాంకర్ అరియానా గ్లోరి అర్హురాలని సంచలన దర్శకుడు వర్మ సైతం చెప్పారంటే నెటిజన్లు సైతం ఆలోచించక మానరు. ఆర్జీవీ స‌పోర్ట్ దొర‌క‌డంతో అరియానా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Rise in Prices: టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు షాక్.. త్వరలో భారీగా పెంపు    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News