మనలో ఎక్కువ శాతం వాట్సాప్ అంటే సరదా,కాల క్షేపాలకే ఉపయోగపడే సాధనంగా చూస్తున్నాం ..కానీ మనసుపెట్టి ఆలోచిస్తే వాట్సాప్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు సోషల్ మీడియా విశ్లేషకులు . మరి వాట్సాప్ తో ఉండే ఉపయోగాలను ఒక్కసారి తెలుసుకుందామా మరి..
బిజినెస్ ప్రమోషన్ కోసం ..
వాట్సాప్ ఇప్పుడు బిజినెస్ అవసరాలను కూడా తీర్చుతోంది... వ్యాపార వృద్ధికి ఇది పెద్ద సమాచార వారదిగా మారింది. కంపెనీలో సేల్ టీం దగ్గరు నుంచి అన్ని విభాగాల వారు వాట్సాప్ ను చక్కగా ఉపయోగించవచ్చు. నిరంతర సంప్రదింపుల కోసం దీన్ని చక్కగా వాడుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ పరధిలో 250 మంది వరకు చోటు ఉంటుంది..మేనేజర్ స్థాయి నుంచి కిందస్థాయి ఉద్యోగి వరకు ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకొని కమ్యూనికేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. మొయిల్ తో పోల్చితే వాట్సాప్ సాయంతో చాలా వేగంగా.. అతి సులభంగా అవతలివారికి కనెక్ట్ కావొచ్చు.
కస్టమర్లతో సంప్రదింపుల కోసం..
కస్టమర్లతో సంప్రదింపుల కోసం వాట్సాప్ మంచి కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగపడుతుంది. ప్రతి విషయం కస్టమర్లకు ఫోన్లు చేసి సమాచారం ఇవ్వడం అన్ని వేళల కుదరదు కాబాట్టి వాట్సాప్ ద్వార తెలియపర్చవచ్చు. అలాగే కష్టమర్ల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను తెలుసుకునేందుకు వాట్సాప్ వేదిక ద్వార తెలుసుకోవచ్చు. అందరికీ ఒకే సమయంలో వివరణ ఇవ్వడం వాట్సాప్ ద్వార కష్టమైన పనే.. అయితే కస్టమర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు దీన్ని ఉపయోగించుకొని .. ఆ తర్వాత మెయిల్ ద్వారా సమాధానం ఇవ్వొచ్చు.
మార్కెటింగ్ ప్రయోషన్స్ కోసం..
మార్కెటింగ్ ప్రయోషన్స్ కోసం వాట్సాప్ చక్కగా వినియోగించుకోవచ్చు. కస్టమర్ల అభిప్రాయాలు నేరుగా తెలుసుకునేందుకు అవకాశముంది. అలాగే ఉత్పత్తుల సమాచారాన్ని తెలియజేసేందుకు వీలుగా వాటిపై వాట్సాప్ నెంబర్ ఇస్తే కస్టమర్ల అభిప్రాయాలు నేరుగా తెలుసుకునే వీలుంటుంది.
వాట్సాప్ ట్యూషన్స్...
వాట్సాప్ ను చిన్న ఆన్ లైన్ పాఠశాలగానూ ఉపయోగించుకోవచ్చు. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు, వారికి అసైన్ మెంట్స్, పాఠాలకు సంబంధించిన ఆడియో, వీడియోలు క్లిప్పులు పంపడం, గ్రాఫిక్స్, చార్టులు పంపడం చేసుకోవచ్చు. క్లాస్ టీచర్, విద్యార్ధులతో కలిపి ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
వైద్య సేవల కోసం...
డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్ ను వాట్సాప్ వేదికగా చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య సమస్యలపై వైద్యుల సూచనలు,సలహాలను కూడా వాట్పాప్ వేదికగా పొందవచ్చు. ఫార్మసీ స్టోర్స్ కు సంబంధించిన వాట్సాప్ నంబర్ ప్రిస్కిప్షన్ పంపితే చాలు..మీరు కోరుకున్న మందులు ప్యాక్ చేసి మీ ఇంటికే పంపేస్తారు
ఫుడ్ ఆర్డర్స్ కోసం...
ఇటీవలీ కాలంలో చాలా రెస్టారెంట్లు తమకు సంబంధించిన మెనూ వాట్సాప్లో పెడుతున్నారు. మెనూ చూసి అందులో నంబర్ నెంబర్ చెబితే చాలు..ఐటంను ఇంటికే డెలివరీ చేస్తారు.అలాగే పుష్కాలు, స్టేషనరీ, బేకరీ ఐటెమ్స్ వంటి ఆర్టర్ల కోసం వాట్సాప్ ను వినియోగించుకోవచ్చు..