Viral Video: ఇదేం ట్విస్ట్ భయ్యా... క్లైమాక్స్ చూసి నటుడిని చెంప దెబ్బలు కొట్టిన మహిళ.. వీడియో వైరల్..

Love Reddy Movie: లవ్ రెడ్డి చిత్ర యూనిట్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. నిజాంపేట్ లోని జీపీఆర్ మాల్ లో.. క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక మహిళ రెచ్చిపోయింది. థియేటర్ లోకి వచ్చిన నటుడిపై దాడికి తెగబడింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 25, 2024, 01:46 PM IST
  • లవ్ రెడ్డి టీమ్ కు షాకింగ్ ఘటన..
  • క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన మహిళ..
Viral Video: ఇదేం ట్విస్ట్ భయ్యా... క్లైమాక్స్ చూసి నటుడిని చెంప దెబ్బలు కొట్టిన మహిళ.. వీడియో వైరల్..

Love Reddy movie incident in Hyderabad: కొంతమంది సినిమాలోని సంఘటనలు చూసి ఎమోషనల్ అవుతుంటారు. కొన్నిసార్లు మూవీలోని సంఘటనలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. మరికొందరు మాత్రం అచ్చం మూవీలో తామే.. నటిస్తున్నట్లు ఫీల్ అవుతుంటారు. అంతే కాకుండా.. పక్కన ఉన్నవాళ్లను కొడుతుంటారు. సీటులో ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తుంటారు. అంతే కాకుండా.. మరికొందరు మాత్రం సినిమా యూనిట్ కన్పిస్తే ఎమోషన్ కు గురౌతుంటారు.

 

థియేటర్ లలో కేకలు పెడుతుంటారు. ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు. అయితే.. తాజాగా, లవ్ రెడ్డి చిత్ర యూనిట్ కు మాత్రం అనుకొని ఘటన ఎదురైంది. ఒక మహిళ చిత్రయూనిట్ మీదకు స్పీడ్ గా వచ్చి అక్కడున్న నటుడ్ని ఛెడాల్ ఫడేల్ అని కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

ఇటీవల లవ్ రెడ్డి మూవీ విడుదలైంది. అంజన్ రామచంద్ర, శ్రావణి హీరో హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే.. ఈ మూవీ మొదట్లో పాజిటివ్ గా టాక్ వచ్చిన  ఆ తర్వాత మాత్రం..జనాల నుంచి రెస్సాన్స్ రాలేదు. దీంతో ఇది కాస్త రేబల్ స్టార్ ప్రభాస్ కు కూడా తెలిసిందంట. ఆయన ఈ మూవీ బాగుందని, లవ్ రెడ్డి మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పారు. దీంతో జనాల్లో మళ్లీ ఈ సినిమా పట్ల  మరల పాజిటివ్ బజ్ ఏర్పడినట్లు తెలుస్తొంది.

అయితే.. తాజాగా.. ఈ మూవీ టిమ్ ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ తెలుసుకొనేందుకు.. ఏకంగా హైదరబాద్ లోని నిజాంపేటలోని ఒక మాల్ కు వెళ్లారు. అప్పుడు క్లైమాక్స్ సీన్ నడుస్తొంది. అప్పుడు.. ఈ టీమ్ అక్కడకి ఎంట్రీ ఇచ్చారు. థియేటర్ లో ఉన్న అభిమానులు విజిల్స్, కేకలు వేశారు. దీంతో మూవీ టిమ్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. ఆ క్లైమాక్స్ లో తండ్రి పాత్రలో నటించిన రామస్వామి.. నటిని రాయితో కొట్టిన సీన్ టెలికాస్ట్ అయ్యింది.

Read more: Samantha: పబ్లిక్‌గా ఆ పని చేసిన సమంత.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో..

దీంతో అక్కడున్న  మహిళ.. కోపంతో.. స్టేజీ మీద ఉన్న లవ్ రెడ్డి టీమ్ దగ్గరకు కోపంతో వచ్చింది. రామ స్వామిని కాలర్ పట్టుకుని, ఏడా పెడా వాయించేసింది. దీంతో చిత్రయూనిట్ షాక్ కు గురయ్యారు. అక్కడి నుంచి సదరు మహిళను పక్కకు తీసుకెళ్లాడు.  కొద్ది సేపు మాత్రం వేదిక మీద టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

Trending News