Yatra 2 Twitter Review: యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది, సినిమా ఎలా ఉందంటే

Yatra 2 Twitter Review: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్రకు సీక్వెల్ ఇది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా నిర్మించిన సినిమా యాత్ర2. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై రివ్యూ ఎలా ఉందో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 8, 2024, 07:15 AM IST
Yatra 2 Twitter Review: యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది, సినిమా ఎలా ఉందంటే

Yatra 2 Twitter Review: వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా యాత్రను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్ మరో అద్భుత దృశ్యకావ్యాన్ని నిర్మించారు. వైఎస్ఆర్ మరణం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేవరకూ వివిధ పరిణామాలపై తీసిన యాత్ర 2 అమెరికా, యూకేలోని పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పూర్తి చేసుకోవడంతో ఆడియన్ రియాక్షన్స్, సినిమా రివ్యూ మొదలైంది.

యాత్రలో వైఎస్ఆర్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి జీవం పోయగా, యాత్ర2లో వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా జీవం పోశాడు. వైఎస్ జగన్ పాత్రలో జీవా అద్భుతంగా నటించాడని, పూర్తిగా జగన్ హావభావాలు పండించగలిగాడంటున్నారు. అంతేకాకుండా సినిమాలో డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయంటున్నారు. ఈ సినిమా కచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నచ్చుతుందని..అదే సమయంలో ప్రత్యర్ధి పార్టీలకు తలనొప్పిగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.>

యాత్ర మొదటి భాగంలో వైఎస్ఆర్ పాత్ర పోషించిన మమ్ముట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత స్క్రీన్ పై అసలు రాజశేఖర్ రెడ్డిని చూపించాడు దర్శకుడు మహి వి రాఘవ్. ఇప్పుడు యాత్ర2లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. సినిమా సివర్లో స్క్రీన్‌పై వైఎస్ జగన్ కన్పిస్తారు. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలేసినా అది పిల్లే..కానీ అక్కడ ఉన్నది పులి. అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా గర్జిస్తుందనే డైలాగ్ ఆకట్టుకుంటుందంటున్నారు. కొందరు నెటిజన్లు ఇదే డైలాగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

 యాత్ర 2 మరో అద్బుతమైన బయోపిక్ గా ఉంటుందంటున్నారు. సినిమాలో ప్రతి సన్నివేశం గూస్‌బంప్స్ తెప్పిస్తుందంటున్నారు నెటిజన్లు. గతంలో తనకు జగన్‌పై ద్వేషం ఉన్నా..ఇప్పుడది ప్రేమగా మారిందంటున్నాడు మరో నెటిజన్. సినిమాకు తానైతే  4/5 రేటింగ్ ఇస్తానంటున్నాడు. మరొకరు యాత్రకు 3/5 రేటింగ్ ఇస్తుంటే జగన్ అంటే నచ్చనివాళ్లు మాత్రం 1/5 రేటింగ్ ఇస్తారని ఆదే నెటిజన్ వ్యాఖ్యానించాడు.

2009 నుంచి 2019 వరకూ వైఎస్ జగన్ జీవితంలో ప్రతి అంశాన్ని అద్భుతంగా చూపించారంటున్నారు. సినిమా పూర్తయ్యేవరకూ ఎవరూ థియేటర్ వదిలి వెళ్లే ప్రసక్తి ఉండదంటున్నారు. యాత్ర మొదటి భాగం విడుదలైనప్పుడు ఎలాంటి ఉద్వేగంతో సినిమా చూసేందుకు జనం వెళ్లారో..ఇప్పుడు అదే భావోద్వేగంతో యాత్ర 2 సినిమా చూసేందుకు వెళతామంటున్నారు. 

Also read: Ananya Panday: అందాల తూనీగలా అనన్య పాండే, లేటెస్ట్ పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News