Drama Juniors Season 7: మీ చిన్నారులకు అద్భుత అవకాశం.. జీ తెలుగు డ్రామా జూనియర్స్​ సీజన్ 7 ​ఆడిషన్స్​ ప్రారంభం

Drama Juniors Season 7 Auditions: చిన్నారుల్లో టాలెంట్‌ను వెలుగులోకి తీసుకువచ్చేందుకు డ్రామా జూనియర్ సీజన్ 7తో జీ తెలుగు ఛానెల్ సిద్ధమైంది. ఈసారి తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు అవకాశం కల్పిస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2024, 07:26 PM IST
Drama Juniors Season 7: మీ చిన్నారులకు అద్భుత అవకాశం.. జీ తెలుగు డ్రామా జూనియర్స్​ సీజన్ 7 ​ఆడిషన్స్​ ప్రారంభం

Drama Juniors Season 7 Auditions: తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త షోలను ప్రారంభిస్తూ విజయవంతంగా దూసుకుపోతోంది జీ తెలుగు ఛానెల్. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలోనూ ముందువరుసలో ఉంటోంది. తాజాగా డ్రామా జూనియర్స్ సరికొత్త సీజన్‌లో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమంది. తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలతోపాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ చిల్డ్రన్స్‌కు అవకాశం కల్పిస్తోంది జీ తెలుగు. చిన్నారుల్లో ఉండే యాక్టింగ్ టాలెంట్‌ను వెలుగు తీసుకురావాలనే ఉద్దేశంతో డ్రామా జూనియర్స్ సీజన్ 7 ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ షో ఇప్పటికే విజయవంతంగా 6 సీజన్‌లను పూర్తి చేసుకుంది. మరో సీజన్‌​తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు సిద్ధమవుతోంది.  

మూడేళ్ల నుంచి 13 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఇదే సువర్ణావకాశం అంటూ ఆహ్వానం పలుకుతోంది. మీ పిల్లల్లోని ప్రతిభను గుర్తించి వారి భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అవకాశం కల్పిస్తోంది. డ్యాన్స్​, సింగింగ్, యాక్టింగ్, మ్యాజిక్​ ట్రిక్స్​, మార్షల్ ఆర్ట్స్‌తోపాటు మీ పిల్లల్లో మరేదైనా ప్రతిభ ఉన్నా.. వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఇదే చక్కని అవకాశం. ప్రపంచవ్యాప్తంగా వివిధ నేపథ్యాలు, జీవనశైలిలో ఎదుగుతున్న టాలెంటెడ్ చిల్డ్రన్స్‌ను గుర్తించే లక్ష్యంతో జీ తెలుగు ఛానల్​ ఈ అవకాశాన్ని అందిస్తోంది.   

డ్రామా జూనియర్స్ సీజన్ 7 ఆడిషన్స్ పాల్గొనాలంటే.. మీ పిల్లల్లోని టాలెంట్‌ను ప్రతిబింబించేలా 2 నిమిషాల నిడివి గల వీడియోను చిత్రీకరించండి. ఆ వీడియోను  DramaJuniorsS7Auditions.Zee5.com లో పోస్ట్ చేయండి లేదా 9100054301 నెంబరుకి వాట్సాప్​ ద్వారా లేదా dramajuniorsseason7@gmail.com కి మెయిల్​ కూడా పంపించవచ్చు. అయితే లిప్ సింక్ ఉన్న వీడియోలు పరిగణనలోకి తీసుకోరు. ఇంకేందుకు ఆలస్యం మీ చిన్నారుల్లోనూ టాలెంట్‌ను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.  

Also Read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

Also Read:  Washing Machine Offers: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.3,990కే రియల్‌ మీ 8.5 Kg Top Load వాషింగ్‌ మెషిన్‌..   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News