Ravi Teja New Movie: జోరు చూపిస్తున్న మాస్ మహారాజ్ రవితేజ.. మరో కొత్త సినిమా ప్రకటన

Ravi Teja New Movie: మాస్ మహారాజా రవితేజ (Raviteja Latest Movies) మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. 'స్వామిరారా' ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2021, 02:09 PM IST
Ravi Teja New Movie: జోరు చూపిస్తున్న మాస్ మహారాజ్ రవితేజ.. మరో కొత్త సినిమా ప్రకటన

Ravi Teja New Movie: వరుస సినిమాలతో జోరుమీదున్న మాస్ మహారాజా రవితేజ (Raviteja New Movies).. మరో సినిమా ప్రకటించారు. 'స్వామిరారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​, టైటిల్​ను విడుదల చేసింది చిత్రబృందం. 'రావణాసుర' అనే టైటిల్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో రవితేజ (Ravi Teja New Movie 2021) విభిన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.  

 

మరోవైపు స్టువర్ట్‌పురానికి చెందిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితకథను వెండితెరకు తీసుకురావాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌. ఇప్పుడీ కథకు హీరోగా నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్​ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు రేపుతోంది. 'వేట​ ప్రారంభమయ్యే ముందు ఉండే నిశ్శబ్దాన్ని ఆస్వాదించండి' అని క్యాప్షన్ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్​ అగర్వాల్​ ఆర్ట్స్​ నిర్మిస్తోంది.

ఈ సినిమాని వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. 70వ దశకంలో వరుస దోపిడీలు, దొంగతనాలతో ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు. అప్పట్లో ఆయన గురించి తెలుగు రాష్ట్రాల్లో కథలు కథలుగా చెప్పుకొనేవారు.

రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి', 'ధమాకా', 'రామారావు ఆన్ డ్యూటీ', 'టైగర్ నాగేశ్వరావు' చిత్రాలు ప్రకటించిన రవితేజ (ravi teja new movie 2021).. ఇప్పుడు 'రావణాసుర' అంటూ ముందుకొచ్చారు. ఇలా వరుస చిత్రాలతో జోరుమీదున్న ఇతడిని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Attack On Vijay Sethupathi: బెంగళూరు ఎయిర్ పోర్టులో నటుడు విజయ్ సేతుపతిపై దాడి.. వీడియో వైరల్

Also Read: Acharya Neelambari Song: ‘నీలాంబరి’ పాట వచ్చేసింది.. రామ్ చరణ్ డ్యాన్స్ అదిరిందిగా!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News