‘సాహో’ లో సరికొత్త ఎలిమెంట్ ; స్పెషల్ సాంగ్ ప్లాన్

                                                                         

Updated: Jul 11, 2018, 08:43 PM IST
‘సాహో’ లో సరికొత్త ఎలిమెంట్ ; స్పెషల్ సాంగ్ ప్లాన్

ప్రభాస్, శ్రద్ధకపూర్ జంటగా నటిస్తున్న ‘సాహో’ మూవీలో సినిమాలో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు స్టెప్పులేయనున్న హీరోయిన్ వేటలో పడింది సినిమా యూనిట్.

వాస్తవానికి  ‘సాహో’ ఘూటింగ్ బిగినింగ్ లో అసలీ స్పెషల్ సాంగ్ ఆలోచన కూడా లేదు. కానీ సడెన్ గా సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయిన డైరెక్టర్ సుజిత్..  ఈ సాంగ్ కోసం స్పెషల్ గా సిచ్యువేషన్  క్రియేట్ చేసి మరీ ప్లాన్ చేస్తున్నారట. స్పెషల్ షాంగ్ కోసం ఇంత హంగామా చేస్తుండంతో అందరి దృష్టి దీనిపై మళ్ళింది.

ఈ మూవీలో చాలా వరకు బాలీవుడ్ నటుల్ని ఫిక్స్ చేసుకున్న  ఫిల్మ్  మేకర్స్ ఈ స్పెషల్ సాంగ్ కోసం కూడా బాలీవుడ్ స్టార్ నే ప్రిఫర్ చేస్తారని టాక్ .. మరికొందరైతే టాలీవుడ్ హీరోయిన్స్ ని సంప్రదిస్తారంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ స్పెషల్ సాంగ్ లో నటించే అందాల భామ ఎవరనే ఈ సస్పెన్స్ బ్రేక్ అవ్వాలంటే ‘సాహో’ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వేచి చూడాల్సిందే మరి. ఇదిలా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సాహో టీమ్ ఈ రోజు నుండే మరో కొత్త షెడ్యూల్ బిగిన్ చేసిందట.