RRR చిత్రం కోసం చెర్రీ హెయిర్ స్టైల్ డిజైన్ చేయనున్న.. ఇండియాస్ టాప్ డిజైనర్

ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు "RRR". యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో కథానాయకులుగా నటిస్తున్నారు. 

Last Updated : Nov 19, 2018, 12:15 PM IST
RRR చిత్రం కోసం చెర్రీ హెయిర్ స్టైల్ డిజైన్ చేయనున్న.. ఇండియాస్ టాప్ డిజైనర్

ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు "RRR". యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో కథానాయకులుగా నటిస్తున్నారు. ఇటీవలే చాలా వైభవంగా ఈ చిత్ర ప్రారంభోత్సవం జరగగా.. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్ హెయిర్ డిజైన్‌ను ప్రత్యేకంగా రూపొందించడానికి రాజమౌళి ఓ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్‌ను ఎంపిక చేశారట. ఆయన పేరు ఆలిమ్ హకీమ్. హకీమ్ భారతదేశంలోనే టాప్ హెయిర్ స్టైలిస్ట్ కావడం విశేషం.

గతంతో ఆయన "సై" చిత్రంలో నితిన్‌కి హెయిర్ డిజైనరుగా పనిచేశారు. ఆ తర్వాత దాదాపు పదిహేనేళ్ల తర్వాత రాజమౌళితో కలిసి ఆయన పనిచేస్తున్నారట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఆర్ఆర్ఆర్' చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ వివరాలు నేడు ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాజమౌళి కూడా ఈ చిత్రంలో తనతో పాటు పనిచేసే సాంకేతిక నిపుణుల అన్వేషణలో ఉన్నారట. 

ఇక రామ్ చరణ్‌కు హెయిర్ స్టైలింగ్ చేస్తున్న ఆలిమ్ హకీమ్ బాలీవుడ్ నటీనటులకు బాగా సుపరిచితుడు. ముంబయిలో ఓ హెయిర్ స్టైలింగ్ అకాడమీని నడపడంతో పాటు.. 4 లాంజ్స్ కూడా రన్ చేస్తున్నారు. షాహిద్ కపూర్, సైఫ్ అలీఖాన్, రణబీర్ కపూర్ లాంటి వారందరికీ ఆయనే హెయిర్ స్టైలింగ్ చేశారట. అలాగే రోబో 2.0 చిత్రం కోసం రజనీకాంత్‌కు కూడా స్టైలింగ్ చేశారట. శంకర్ దర్శకత్వం వహించిన ఐ, స్నేహితుడు చిత్రాలలో కథానాయకులకు కూడా హకీమ్ హెయిర్ స్టైలింగ్ చేశారు.

Trending News