రేపటి నుంచి అభిమానుల వద్దకు ప్రభాస్

హీరో ప్రభాస్ తన అభిమానుల్ని కలవబోతున్నారు.

Last Updated : Apr 2, 2018, 04:31 PM IST
రేపటి నుంచి అభిమానుల వద్దకు ప్రభాస్

హీరో ప్రభాస్ తన అభిమానుల్ని కలవబోతున్నారు. రేపటి నుంచి నాలుగురోజుల వరకు ప్రభాస్ తన అభిమానులను ప్రత్యేకంగా కలసి ముచ్చటించనున్నారు. ప్రస్తుతం 'సాహో' మూవీ దుబాయ్‌లో షూటింగ్ జరుగుతోంది. తన షెడ్యుల్ ఈరోజుతో పూర్తికావొచ్చని తెలుస్తోంది. అయితే ప్రభాస్ తన అభిమానులను ఎక్కడ ఎలా కలవనున్నడనే సమాచారంపై స్పష్టత కరువైంది.

'సాహో' సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా నుండి మరో టీజర్ త్వరలో రానుంది. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతోందని సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ న‌టి శ్రద్ధా క‌పూర్ హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకూ పూర్తయింది.  కీలక సన్నివేశాలను దుబాయ్‌లో షూట్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ‘కెన్నీ బేట్స్’ డిజైన్ చేసిన భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. గత రెండు రోజులుగా అక్కడ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షెడ్యూల్ నేటితో కంప్లీట్ అవ్వొచ్చని సమాచారం. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. కాగా ప్రభాస్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించబోతున్నాడు. అందులో ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. 

Trending News