ఆల్ టైమ్ గరిష్టానికి బంగారం ధరలు, వెండి జిగేల్

బులియన్ మార్కెట్‌లో బంగారం ఆల్ టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసింది. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి ఏకంగా రూ.50వేల మార్క్ చేరుకోవడం గమనార్హం.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 1, 2020, 08:57 AM IST
ఆల్ టైమ్ గరిష్టానికి బంగారం ధరలు, వెండి జిగేల్

వారం మధ్యలో బంగారం ధరలు తగ్గినా వారాంతానికి భారీగా ధరలు పెరిగాయి. మరోసారి ఆల్‌టైమ్ గరిష్టానికి బంగారం ధరలు చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ వరుసగా రెండోరోజూ ధరలు పెరిగాయి. మరోవైపు వెండి సైతం బంగారం బాటలోనే నడిచింది. ఏకంగా రూ.50వేల మార్క్ చేరుకుని రికార్డు నమోదు చేసింది.  జూన్‌ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు‌.. కొత్త మార్గదర్శకాలు, కొత్త సడలింపులు

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నిన్న సాయంత్రం బంగారం ధర రూ.360 మేర పుంజుకుంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,150కి పెరిగింది. నేడు అదే ధరలో బంగారం కొనసాగుతోంది. బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట ధర నమోదు చేసింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,080 వద్ద ట్రేడ్ అవుతోంది.  బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు రెండురోజుల తర్వాత పెరిగాయి. నిన్న సాయంత్రం బంగారం ధరం రూ.200 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,500కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.45,700కి ఎగసింది.

బంగారం రికార్డు ధరలు నమోదు చేయగా వెండి సైతం అదే దారిలో పయనించింది. వెండి ధర నిన్న ఏకంగా రూ.1,550 పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.50,100కి చేరుకుంది. బులియన్ మార్కెట్‌లో వెండి ఆల్ టైమ్ గరిష్ట ధర ఇదే కావడం గమనార్హం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

Trending News