close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఆదిలోనే బంపర్ ఆఫర్ ; మన్మధుడు- 2లో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ !

ఆమె ఫిల్మ్ ఇండస్ట్రికి అంతగా పరిచయం లేదు. కానీ ఆమె ఏకంగా ‘మన్మధుడు 2’ లో నటించేందుకు బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇంతకీ ఎవరీ లక్కీ భామ అనుకుంటున్నారా ? అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది

Updated: Apr 29, 2019, 02:57 PM IST
ఆదిలోనే బంపర్ ఆఫర్ ; మన్మధుడు- 2లో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ !

ప్రస్తుతం మన్మధుడు 2 చిత్ర యూనిట్  పోర్చుగల్ షెడ్యూల్  లో బిజీగా ఉంది. షూటింగ్ షెడ్యూల్ లో అక్షర గౌడ వచ్చి జాయిన్ అయింది. ఆమె సెకండ్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుందని, ఈ సినిమాతో గ్రాండ్ డెబ్యూ కి రెడీ అవుతుందని టాక్. అసలెవరీ అక్షర గౌడ..? నిజంగా మన్మధుడు 2 లో నటిస్తుందా..? స్ట్రేట్ గా క్వశ్చన్ కి సమాధానం చెప్పాలంటే అవును…అక్షర గౌడ 'మన్మధుడు2' లో నటిస్తుంది. 

ఆదిలోని బంపర్ ఆఫర్ కొట్టేసింది నిజమే కానీ .. అక్షర గౌడ ఈ సినిమాలో చేసేది జస్ట్ అతిధి పాత్రలోనే నట. సినిమాలోని ఓ సందర్భంలో జస్ట్ అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోతుందంతే. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే తమిళ, కన్నడ సినిమాలు కలిపి 6 కు పైగా సినిమాల్లో నటించింది అక్షణ గౌడ తమిళంలో మంచి క్రేజ్ సంపాదించింది.

అక్షర గౌడ  తెలుగు సినిమాల్లో కూడా  సీరియస్ గా ట్రై చేస్తుంది  కానీ.. సరైన అవకాశం రాక ఇంకా వెయిటింగ్ మోడ్ లోనే ఉంది. ఈ లోపు ‘మన్మధుడు2’ ఆఫర్ వచ్చేసరికి, నాగ్ సినిమాలో కామియో గా అయినా ఓకె అనేసిందట. ఈ సినిమా తరవాత వరస అవకాశాలు గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ తో ఉంది అక్షర గౌడ.

Tags: