Allu Arjun: అల్లు అర్జున్ చిరు సినిమాలో చేయడం లేదట

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా (Acharya movie) చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఆచార్య మూవీ షూటింగ్ వాయిదా పడింది. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుని ఆ తర్వాత మరో సినిమాకు షూటింగ్ స్టార్ట్ చేసేందుకు చిరు సిద్ధంగా ఉన్నాడు.

Last Updated : Apr 22, 2020, 01:09 AM IST
Allu Arjun: అల్లు అర్జున్ చిరు సినిమాలో చేయడం లేదట

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా (Acharya movie) చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఆచార్య మూవీ షూటింగ్ వాయిదా పడింది. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుని ఆ తర్వాత మరో సినిమాకు షూటింగ్ స్టార్ట్ చేసేందుకు చిరు సిద్ధంగా ఉన్నాడు. మళయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ అనే సినిమాను చిరు హీరోగా తెలుగులో రీమేక్ (Telugu remake of Lucifer) చేయనున్నాడు. రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. లూసిఫర్ చిత్రంలో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా నటించగా.. మళయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ (Prithviraj) మరో ముఖ్య పాత్రలో కనిపించాడు. అయితే, ఆ పాత్ర కోసం తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని తీసుకోనున్నట్టుగా గత కొంత కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది.

Also read : Young talent: ఆర్జీవీని ఫిదా చేసిన సాంగ్.. క్రియేటివిటీ అద్భుతం

చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్ నటించనున్నాడని వస్తున్న వార్తలపై తాజాగా ఆయన పీఆర్ టీమ్ స్పందించినట్టు తెలుస్తోంది. లూసిఫర్ తెలుగు రీమేక్ సినిమాకు అల్లు అర్జున్ సైన్ చేయలేదని.. ఆయన ఆ చిత్రంలో నటించనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టంచేసినట్టు సమాచారం. స్వయంగా అల్లు అర్జున్ పీఆర్ టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది కనుక ఇకనైనా చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ అనే రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పడుతుందేమో వేచిచూద్దాం మరి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News