మళయాళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కతున్న ABCD మూవీ గురించి హీరో అల్లు శిరీస్ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ఈ రోజు ABCD మూవీ థియేటర్స్ లోకి రానున్న నేపథ్యంలో అల్లు శిరీస్ మాట్లాడుతూ ABCD మూవీ రీమేక్ అయినప్పటికీ అందులో చాలా మార్పులున్నాయని ప్రకటించాడు.
ఈ మూవీలో అన్నీ కొత్త ట్యూన్స్
ABCD మూవీ గురించి అల్లు శిరీస్ మాట్లాడుతూ ఒరిజినల్ వెర్షన్ లో ట్యూన్స్ ఒక్కటి కూడా వాడలేదు..అన్నీ కొత్త ట్యూన్స్ అని చెప్పుకొచ్చాడు. సినిమాలో సీన్స్ కూడా ఒరిజినల్ నుంచి ఓ 15 మాత్రమే తీసుకున్నాడు. సినిమాలోని సోల్ మాత్రమే తీసుకొని కంప్లీట్ గా ఒక తెలుగు సినిమాలా తీర్చిదిద్దామన్నామని తెలిపాడు.
మరింత కామిడీ పండిస్తుంది..
మళయాళం వెర్షన్ లో హీరోయిన్, విలన్ పాత్రలు లేవు. కానీ తెలుగులో పెట్టాం. అలాగే కొన్ని కామెడీ సీన్స్ కూడా క్రియేట్ చేసాం... ఒరిజినల్ సినిమా చూసిన వాళ్లకు కూడా ABCD కొత్తగా కనిపిస్తుందని అల్లూ శిరీష్ పేర్కొన్నాడు. అల్లు శిరీష్ స్టేట్ మెంట్ తో రీమేకే కదా అన్న ఆలోచన నుంచి ఏదో కొత్తదనం ఉంటుందనే ఆసక్తి ఆడియన్స్ లో నెలకొంది.