SIT Movie OTT: జీ5లో దూసుకుపోతున్న SIT.. టాప్‌-5లో ట్రెండింగ్

SIT Movie Streaming on ZEE 5: క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) జీ5 ఓటీటీలో దూసుకుపోతుంది. టాప్-5లో ట్రెండ్ అవుతుందని ఈ సినిమా డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2024, 07:25 PM IST
SIT Movie OTT: జీ5లో దూసుకుపోతున్న SIT.. టాప్‌-5లో ట్రెండింగ్

SIT Movie Streaming on ZEE 5: అరవింద్ కృష్ణ, నటాషా దోషి జంటగా.. విజయ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మూవీ S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా నిర్మించగా.. మే 10వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

Also Read: Google Maps Tips: గూగుల్ మ్యాప్స్‌లో మీ హోమ్ అడ్రస్ యాడ్ చేయండి.. సింపుల్ స్టెప్స్ ఇవిగో..!  

తాను కడప జిల్లాలోనే పుట్టి పెరిగానని విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. అక్కడే విద్యాభ్యాసం జరిగిందని.. తమది ఉమ్మడి కుటుంబం అని అన్నారు. తనకు రైతుల కష్టం తెలుసు అని.. మా తండ్రి పడ్డ కష్టాలు తాము పడకూడదని మా అందరినీ ఉన్నత చదువులు చదివించారని గుర్తు చేసుకున్నారు. తన డిగ్రీ పూర్తయిన తరువాత హైదరాబాద్‌కు వచ్చానని.. ఆ సమయంలోనే తాను ఐసెట్, డీఎఫ్‌ టెక్ కోర్సులకు కోచింగ్ తీసుకున్నానని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీఏ కంప్లీట్ చేసి.. ఆ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చానని అన్నారు. వివిధ దర్శకుల వద్ద అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా వివిద దర్శకుల వద్ద పని చేశానని తెలిపారు.

SIT సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాయని.. తాను సినిమాల్లోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదన్నారు. కానీ పెద్దనాన్న అండగా నిలబడడంతో ఇండస్ట్రీలో ఉండగాలినని చెప్పుకొచ్చారు. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని.. తన డిగ్రీ ఫ్రెండ్స్ ఫండింగ్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైందని తెలిపారు. ఈ స్టోరీని వెబ్ సిరీస్ కంటే సినిమా తీస్తేనే బాగుంటుందని అన్నారని.. నాగి రెడ్డి, బాల్ రెడ్డి తనను ముందు నుంచీ ప్రోత్సహిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఓ ఫ్రెండ్ ద్వారా నిర్మాత తేజని విశాఖపట్నంలో కలిశానని.. శ్రీనివాస్, రమేష్ ఇలా అందరూ కలిసి ఈ సినిమాను ఇక్కడి వరకు తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు.

ఈ సినిమాలో హీరో అరవింద్ కృష్ణ అద్భుతంగా నటించారని.. ఆయన సహకారం ఎప్పటికీ మర్చిపోలేననని అన్నారు విజయ భాస్కర్ రెడ్డి. నటీనటులు, టెక్నీషియన్ల సహకారంతోనే ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగానని అన్నారు. 
ముందు నుంచి ఓటీటీ కోసమే తాము ప్రయత్నాలు చేశామని.. మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. సెకెండ్, థర్డ్ పార్ట్ ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారని.. పాన్ ఇండియా వైడ్‌గా రీచ్ అయిందని తెలుస్తోందన్నారు. జీ5లో SIT మూవీ టాప్ 5లో ట్రెండ్ అవుతుండడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 

Also Read: Lucknow: తాగడానికి ఒప్పుకోలేదని దారుణం.. టెర్రస్ పై నుంచి తోసేసిన మందు బాబులు.. వీడియో వైరల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News