త్వరలో మీముందుకు రాబోతున్న బజాజ్ డొమినార్ -250 బైక్

బైక్ ప్రియులకు మరో బజాజ్ శుభవార్తను అందిచింది. త్వరలో బజాజ్ విడుదల చేయబోతున్న డొమినార్ 250 బైక్ ను  దేశవ్యాప్తంగా ఇప్పటికే డీలర్లు  బుకింగ్‌ లు  మొదలుపెట్టారు.కాగా డొమినార్-250 ఇప్పటికే డీలర్‌షిప్‌ల వద్దకు రావడం ప్రారంభమవ్వగా ఎప్పుడెప్పుడా అని బైక్ ప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు.   

Updated: Mar 9, 2020, 04:11 PM IST
త్వరలో మీముందుకు రాబోతున్న బజాజ్ డొమినార్ -250 బైక్

హైదరాబాద్: బైక్ ప్రియులకు మరో బజాజ్ శుభవార్తను అందిచింది. త్వరలో బజాజ్ విడుదల చేయబోతున్న డొమినార్ 250 బైక్ ను  దేశవ్యాప్తంగా ఇప్పటికే డీలర్లు  బుకింగ్‌ లు  మొదలుపెట్టారు.కాగా డొమినార్-250 ఇప్పటికే డీలర్‌షిప్‌ల వద్దకు రావడం ప్రారంభమవ్వగా ఎప్పుడెప్పుడా అని బైక్ ప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు. 

డొమినార్ 250 బజాజ్ పై ప్రయాణం ఆహ్లాదకరంగా  ఉంటుందని, ధర కూడా సరసమైన రీతిలో ఉంటుందని బజాజ్ తెలియజేస్తోంది. ఈ  వాహన ఆకృతి డొమినార్ 400 మాదిరిగానే ఉంటుందని, వీటిలో ప్రకాశవంతమైన LED హెడ్‌ల్యాంప్, LED టెయిల్ లాంప్, ట్విన్ డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మోడల్ లో రెండు కలర్స్ ఉంటాయని, అవి ఎరుపు,మాట్ బ్లాక్ లో  విడుదల చేయబోతోన్నట్లు తెలిపారు. 

బజాజ్ డొమినార్ 250 ఇంజిన్ వివరాలు

బజాజ్ డొమినార్ 250, KTM 250 డ్యూక్ ను పోలి ఉంటుందని, రిప్ శబ్దం ktm ను పోలి ఉటుందని, 6-స్పీడ్ గేర్‌బాక్స్  తో యువతకు మరో క్రేజీ బైక్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు. డొమినార్ 250 ధర రూ .1.6 లక్షల నుండి రూ .1.7 లక్షలు ఉండొచ్చని, డొమినార్ 400 కన్నా రూ .30,000 ఎక్కువగా ఉంటుందని, ఈ బైక్ ఎంతగానో అబ్బురపరుస్తుందని బజాజ్ తెలిపింది. కాగా బజాజ్ డొమినార్ 250, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 తో పోటీ పడనుందనే నమ్మకం తమకుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..