TOP 25 Districts: ప్రపంచ ఆర్ధిక శక్తిగా ఎదగాలనే ఇండియా టార్గెట్ చేరుకోవడంలో వివిధ రాష్ట్రాలు, జిల్లాలు ముఖ్య భూమిక వహిస్తుంటాయి. ఈ క్రమంలో జీడీపీలో అగ్రస్థానంలో ఉన్న టాప్ 25 జిల్లాలేవో చెక్ చేద్దాం. గర్వించే విషయమేంటంటే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అత్యధిక జీడీపీతో టాప్ 1లో నిలిచింది. హైదరాబాద్ 18వ స్థానంలో ఉంది. ఏపీ నుంచి ఒక్క జిల్లా కూడా టాప్ 25లో లేకపోవడం గమనార్హం.
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతం నుంచి గురుగ్రామ్, గౌతమ్ బుద్ధనగర్, ఫరిదాబాద్, పానిపట్, ఢిల్లీ ఎన్‌సీఆర్ ఉన్నాయి. దక్షిణాదిలో తెలంగాణ నుంచి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలున్నాయి. తమిళనాడు నుంచి అత్యధికంగా కోయంబత్తూరు, తిరువల్లూరు, ఈరోడ్, నమక్కల్, చెన్నై ఉన్నాయి. కర్ణాటక నుంచి బెంగళూరు, దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్ మంగళూరు ఉన్నాయి. గుజరాత్ నుంచి అహ్మదాబాద్, గాంధీనగర్, భరూచ్, నర్మద జిల్లాలున్నాయి. దేశ జీడీపీ సరాసరిన 225 కోట్లుగా ఉంది.
టాప్ 25 జిల్లాలు జీడీపీ
1. రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, 1146 కోట్లు
2. గురుగ్రామ్, హర్యానా, 905 కోట్లు
3. బెంగళూరు అర్బన్, కర్ణాటక 893 కోట్లు
4. గౌతమ్ బుద్ధనగర్, యూపీ 848 కోట్లు
5. సోలాన్, హిమాచల్ ప్రదేశ్ 810 కోట్లు
6. గోవా 764 కోట్లు
7. సిక్కిం 746 కోట్లు
8. దక్షిణ కన్నడ 669 కోట్లు
9. ముంబై, మహారాష్ట్ర 657 కోట్లు
10 అహ్మదాబాద్, గుజరాత్ 643 కోట్లు
11. గాంధీనగర్ 603 కోట్లు
12. ఉడుపి, కర్ణాటక 584 కోట్లు
13. తిరువల్లూరు, తమిళనాడు 582 కోట్లు
14. ఫరీదాబాద్, హర్యానా 581 కోట్లు
15. చిక్ మంగళూరు, కర్ణాటక 569 కోట్లు
16. తిరవల్లూరు, తమిళనాడు 569 కోట్లు
17. ఈరోడ్, తమిళనాడు 568 కోట్లు
18. హైదరాబాద్ 539 కోట్లు
19. హరిద్వార్, ఉత్తరాఖండ్ 533 కోట్లు
20. పానిపట్, హర్యానా 530 కోట్లు
21. నమక్కల్, తమిళనాడు, 522 కోట్లు
22. చెన్నై, తమిళనాడు, 520 కోట్లు
23. భారుచ్, గుజరాత్, 505 కోట్లు
24. నర్మద, గుజరాత్ 505 కోట్లు
25. ఢిల్లీ ఎన్‌సీఆర్ 501 కోట్లు
Also read: New Pensions: పింఛన్ దారులకు శుభవార్త, డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.