Chiranjeevi - Allu studio : తరతరాలు ఆయన్ను తలుచుకుంటూనే ఉండాలి.. పిల్లనిచ్చిన మామపై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్

Chiranjeevi Hails Allu Ramalingaiah And Allu Studio Inauguration on 100th birth anniversary, అల్లు రామలింగయ్య వందో జయంతి సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన స్పీచ్ అదిరిపోయింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2022, 02:06 PM IST
  • అల్లు రామలింగయ్య వందో జయంతి
  • అల్లు స్టూడియోను ప్రారంభించిన మెగాస్టార్
  • మామపై ప్రశంసలు కురిపించిన చిరంజీవి
Chiranjeevi - Allu studio : తరతరాలు ఆయన్ను తలుచుకుంటూనే ఉండాలి.. పిల్లనిచ్చిన మామపై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్

Chiranjeevi - Allu Ramalingaiah : అల్లు బ్రాండ్ అందరికీ తెలిసేలా, తరతరాలు గుర్తుండేలా.. అల్లు అరవింద్, అల్లు అర్జున్ వేసిన ప్లాన్ గురించి అందరికీ తెలిసిందే. భారీ స్టూడియోను నిర్మించబోతోన్నట్టు బన్నీ ఇది వరకే ప్రకటించాడు. అల్లు స్టూడియో అంటూ బన్నీ తన బ్రాండ్‌‌ను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే గండిపేట్‌లో 10 ఎకరాల్లో అల్లు స్టూడియోస్‌ను భారీ స్థాయిలో నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో.. ప్రపంచ స్థాయి సధుపాయాలు ఈ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయి. మూవీకి సంబంధించి అన్ని పనులు ఇక్కడే చేసుకునేలా ఏర్పాటు చేశారు. షూటింగ్స్‌కు సంబంధించిన బిల్డింగ్‌ పనులు పూర్తవ్వడంతో.. సినిమా చిత్రీకరణకు అందుబాటులోకి వచ్చాయి. 

అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. అనంతరం చిరు మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. శ్రీ అల్లు రామలింగయ్య గారు.. మా మామగారు.. వారి శత జయంతి సందర్భంగా.. ఆయన్ను తలుచుకుంటూ.. ఘన నివాళి అర్పిస్తున్నాను.. ఎంతో మంది గొప్ప నటులున్నారు.. గానీ కొద్ది మందికే ఇలాంటి ఘనత దక్కుతుంది. మీ లాంటి అభిమానులు, ప్రేమ వారికి దక్కింది. అల్లు అర్జున్, శిరీష్ బాబీ ఇలా అందరూ కూడా సినిమా రంగంలో ఉండటం.. నాడు ఎప్పుడో పాలకొల్లులో ఆయన మదిలో నటుడిగా ఉన్న ఆ కోరిక.. మద్రాసుకు వెళ్లడం, నటుడిగా చాటుకోవడం, నిలదొక్కుకోవడమనే బలీయమైన ఆలోచనే.. నేడు పెద్ద వ్యవస్థగా మారింది. ఆయన్ను ప్రతిక్షణం.. అల్లు వారు తరతరాలు తలుచుకుంటూనే ఉండాలి.. ఆయన ఒక్కరే నిలదొక్కుకున్నారు.. కొడుకు అల్లు అరవింద్‌ను నిర్మాత చేయాలని గీతా ఆర్ట్స్ సంస్థను స్థాపించారు. తండ్రి నుంచి అన్ని లక్షణాలను పుణికి పుచ్చుకున్నాడు.. అగ్ర నిర్మాతగా నేడు నిలబడ్డాడు. బాబీ, బన్నీ, శిరీష్ ఇలా అందరూ మంచి సూపర్ స్టార్డంలో నిల్చున్నారంటే.. మేమంతా కూడా ఆయన్ను తలుచుకోవాలి.

అల్లు స్టూడియో లాభాపేక్ష కోసం చేసినదని నేను అనుకోను.. డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే ఇది కట్టారని నేను అనుకోను.. అలా అని డబ్బులు రాకూడదని కాదు.. ఇందులోనూ వీరు లాభాలు గడించాలి..  లాభాపేక్ష కంటే.. ఓ స్టేటస్ సింబల్.. గుర్తింపు కోసం.. ఆయనకు కృతజ్ఞతను చెప్పుకోవడం కోసం నిర్మించారు. రాబోయే తరాలు తెలుసుకోవాలి.. అల్లు అనే బ్రాండ్ అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతోనే స్టూడియోను నిర్మించారు. మనకు బాట ఏర్పర్చిన వ్యక్తులకు ఇంత కంటే గొప్ప బహుమతి ఇవ్వలేం.. ఇలాంటి ప్రయత్నం చేసిన అల్లు అరవింద్, అల్లు అర్జున్, శిరీష్, బాబీలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ ఫ్యామిలీలో భాగమైనందుకు నాకు సంతోషంగా ఉంది.. మళ్లీ నేను సాయంత్రం ఈవెంట్లో మాట్లాడుతాను. మధ్యలో ముంబైకి వెళ్లి సల్మాన్ ఖాన్‌తో గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ కోసం లంచ్ అవర్లో వెళ్లాలి.. మళ్లీ సాయంత్రం వస్తాను.. అప్పుడు మరింతగా మాట్లాడతాను’ అని చిరంజీవి వెళ్లిపోయాడు.

Also Read : పల్లకిలో సింగర్ మంగ్లీ.. వీడియో వైరల్

Also Read : కంటెస్టెంట్లతో ఆడుకుంటున్న హోస్ట్.. నాగార్జున ఆన్ ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News