చిత్రలహరి ట్రైలర్: సక్సెస్ గంటలోనే రాదు.. టైమ్ పడుతుంది

చిత్రలహరి ట్రైలర్: నా పేరు విజయ్.. నా జీవితంలో లేనిదే అది

Last Updated : Apr 7, 2019, 06:31 PM IST
చిత్రలహరి ట్రైలర్: సక్సెస్ గంటలోనే రాదు.. టైమ్ పడుతుంది

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన కొత్త సినిమా చిత్రలహరి ఏప్రిల్ 12న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా నిర్మాతలు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించగా నివేధా పేతురాజ్, సునిల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. '' నాపేరు విజయ్, నా పేరులో వున్న విజయం నా జీవితంలో లేదు. ఆ విజయం నా జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని ఐయామ్ వెయిటింగ్ '', ''ఒకే దిక్కున ఉదయించే సూర్యుడు నాలుగు దిక్కులు ఉదయించినా ఇంత వెలుతురు కూడా రాని జీవితం నాది. ఎందుకంటే చీకటికి చిరునామా నేను'' వంటి డైలాగ్స్ ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ విజయం కోసం ఎంత పరితపించే పాత్రలో నటించాడనే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి.

 

Trending News