Flaxseed For Bad Cholesterol: అవిసె గింజలు శరీరానికి ఆరోగ్యమైన కొవ్వు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లను చేకూర్చుతాయి. కాబట్టి వీటిని బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఆహారంలో వినియోగిస్తారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించి రక్తపోటును కూడా తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చాలామంది శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు ఈ గింజలనే వినియోగిస్తారు.
ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది చెడు కొలెస్ట్రాల సమస్యల బారిన పడుతున్నారు. అయితే చెడు కొలెస్ట్రాల్ కారణంగా ఊబకాయం, గుండెపోటు వంటి తీవ్ర వ్యాధులు కూడా వస్తున్నాయి. ఎంత సులభంగా చెడు కొలెస్ట్రాల నుంచి ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.
అయితే ఇటీవలే అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ చేపట్టిన అధ్యయనంలో అవిసె గింజలను చెడు కొలెస్ట్రాల సమస్యలతో బాధపడుతున్న వారు ఆహారంలో తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు. అయితే అవిస గింజలు తిన్న తర్వాత శరీరం పేరుకుపోయిన కొలెస్ట్రాల్ క్రమంగా కరుగుతూ వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
అవిసె గింజలు నిజంగా కొలెస్ట్రాలను తగ్గిస్తాయా..?:
అవిసె గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు, కరిగే ఫైబర్ మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికే కాకుండా శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వీటిలో గుండెకు మేలు చేసే లినోలెనిక్ యాసిడ్ (ALA) కూడా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే ఉబ్బర సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
ప్రతిరోజూ లిన్సీడ్ ఎందుకు తినాలి?
ప్రతిరోజు ఐదు గ్రాముల అవిసె గింజలను తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేరుతాయి. ముఖ్యంగా శరీర బరువు తగ్గడమే కాకుండా పేరుకుపోయిన చెడు కొలస్ట్రాలను కూడా అనతి కాలంలోనే నియంత్రిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆహారంలో ఈ గింజలను వినియోగించాల్సి ఉంటుంది.
అవిసె గింజలను ఎవరు తినకూడదు?:
మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారు అవిసె గింజలను తినకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మూత్రపిండాలపై ప్రభావం చూపి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది. వీటిని అతిగా తీసుకోవడం వల్ల కొందరిలో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.
Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook