OMG Video: అందరి ముందు స్టేజ్ పై ట్రైనర్ పై దాడికి పాల్పడిన ఎలుగుబంటి, వీడియో వైరల్

Bear Attack Video: సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేస్తే ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. తాజాగా ఎలుగుబంటి ట్రైనర్‌పైనే దాడి చేసిన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2022, 04:29 PM IST
  • నెట్టింట వైరల్ అవుతున్న ఎలుగుబంటి వీడియో
  • విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు
OMG Video: అందరి ముందు స్టేజ్ పై ట్రైనర్ పై దాడికి పాల్పడిన ఎలుగుబంటి, వీడియో వైరల్

Bear Attack Video: సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇందులో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాము, మెుసలి, ఏనుగు, చిరుతపులి, సింహాలకు సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఎలుగుబంటికి (Bear Attack Video)సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అప్ లోడ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియో మిలియన్స్ వ్యూస్ సంపాదించింది. 

మీలో చాలా మంది పల్లెల్లో జరిగే డ్యాన్ బేబీ డ్యాన్స్ లు, నాటకాలు, యానిమల్స్ తో రకరకాల విన్యాసాలు చేయించడం లాంటివి చూసే ఉంటారు. తాజాగా ఓ ఊరిలో ఎలుగుబంటితో ప్రోగ్రాం చేస్తున్నారు కొందరు నిర్వాహకులు. ఇందులో మెుదట శిక్షకుడితో కలిసి ఎంతో చక్కగా ప్రదర్శన ఇచ్చింది ఎలుగుబంటి. ఏమైందో తెలియదు కానీ స్టేజ్ పై ఉన్న  ట్రైనర్ పై ఒక్కసారిగా దాడికి పాల్పడింది ఎలుగుబంటి. అతడిని తీవ్రస్థాయిలో గాయపరిచింది. అక్కడ ఉన్నవారు భల్లూకాన్ని తప్పించి అతడిని కాపాడారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఇలా జంతువులను షోలకు ఉపయోగించడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Animal Power (@animals_powers)

 

Also Read: Bahubali Samosa Challenge: 30 నిమిషాల్లో ఈ సమోసా తింటే.. రూ. 51 వేలు మీవే! ట్రై చేయండి మరి

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News