close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

'ఇ' విటమిన్ ఆరోగ్యానికెంతో మేలు

కొన్ని రకాల వంటనూనెలు, పొద్దుతిరుగుడు, గుడ్డులోని పచ్చ సోన, ఆకుకూరల్లో, తృణధాన్యాల్లో ఎక్కువగా ఉండే  విటమిన్ ఇ వల్ల ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు అంటున్నారు.

Updated: Aug 7, 2018, 04:24 PM IST
'ఇ' విటమిన్ ఆరోగ్యానికెంతో మేలు

కొన్ని రకాల వంటనూనెలు, పొద్దుతిరుగుడు, గుడ్డులోని పచ్చ సోన, ఆకుకూరల్లో, తృణధాన్యాల్లో ఎక్కువగా ఉండే విటమిన్ 'ఇ' వల్ల ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు అంటున్నారు.

  • విటమిన్ 'ఇ' శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలోని కణాలను ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది.
  •  'ఇ' విటమిన్ ఉన్న పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హానికారక క్రిములు, క్యాన్సర్ కణాల బారిన పడకుండా రక్షిస్తుంది.
  • శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి శరీరాన్నీ ఆరోగ్యంగా మారుస్తుంది. మడతలు, చర్మం పొడిబారడం లాంటి సమస్యలు అదుపులోకి వస్తాయి.
  • చూపు మందగించడం, అల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే 'ఇ' విటమిన్‌ని ఎక్కువగా తీసుకోవాలి.
  • విటమిన్ 'ఇ'ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండెపోటుతో పాటు హృద్రోగ సమస్యలు దూరమవుతాయి. అధిక బరువూ తగ్గుతుంది.
  • ఒత్తిడి తట్టుకునేందుకు 'ఇ' విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది.
  • ఇ' విటమిన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మెటబాలిజమ్ సమస్యలు, మధుమేహ సమస్యలు దగ్గరకి రావు.