ఇక నుంచి సరికొత్త గెటప్‌లో మహేష్ బాబు

                        

Last Updated : May 25, 2018, 03:55 PM IST
ఇక నుంచి సరికొత్త గెటప్‌లో మహేష్ బాబు

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘భరత్ అనే నేను’ తర్వాత వంశీ పైడిపల్లి సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నాడు మహేష్ బాబు. అయితే బి.ఎ.ఎన్ లో మోస్ట్ స్టైలిష్ సీఎం గా కనిపించిన మహేష్ బాబు ఇకనుండి సరికొత్త లుక్స్ లో మెస్మరైజ్ చేయనున్నాడు.

ఇప్పటికే 2 సినిమాలను లైనప్ చేసుకున్న మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమా తరవాత ఇమ్మీడియట్ గా సుకుమార్ తో సెట్స్ పై ఉంటాడు. ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా అర్బన్ లుక్స్ లో కనిపించనున్నాడని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అందుకే ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మొత్త వంశీ సినిమాలో మహేష్ బాబు లుక్స్ పైనే ఫిక్సయింది.
 
ఇప్పటికే మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన వంశీ పైడిపల్లి అండ్ టీమ్, ప్రస్తుతం ఫోకస్ మొత్తం మహేష్ బాబు లుక్స్ పైనే పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు గెడ్డంతో  కనిపిస్తాడని  కొందరు ఎక్స్ పెక్ట్ చేస్తుంటే, కంప్లీట్ గా డిఫెరెంట్ హెయిర్ స్టైల్  తో కనిపిస్తాడని  మరికొందరు  గెస్ చేస్తున్నారు. 

అసలే మహేష్ బాబుక్ ఇది 25 వ సినిమా కావడంతో న్యాచురల్ గానే ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. మరి వంశీ మైండ్ లో మహేష్ బాబు లుక్స్ ఎలా ఫిక్సయి ఉన్నాయో ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

Trending News