పవర్‌ఫుల్ రిపోర్టర్‌గా సుమంత్.. ఇదం జగత్ ట్రైలర్ విడుదల

సుమంత్ రిపోర్టర్ పాత్రలో నటించిన ఇదం జగత్ మూవీ ట్రైలర్

Last Updated : Dec 20, 2018, 03:09 PM IST
పవర్‌ఫుల్ రిపోర్టర్‌గా సుమంత్.. ఇదం జగత్ ట్రైలర్ విడుదల

ఇటీవలే సుబ్రహ్మణ్యపురం సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన సుమంత్ ప్ర‌స్తుతం అనిల్ శ్రీకంఠం ద‌ర్శ‌క‌త్వంలో ఇదం జగత్ అనే సినిమా చేస్తున్నాడు. సుమంత్ సరసన కేరళ కుట్టి అంజు కురియ‌న్ జంటగా నటించిన ఇదం జగత్ ట్రైలర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. విరాట్ ఫిల్మ్స్, శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్లపై జొన్నగడ్డల పద్మావతి, శ్రీధర్ సంయుక్తంగా ఇదం జ‌గ‌త్ చిత్రంలో శివాజీ రాజా, సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో సుమంత్  ఓ రిపోర్టర్ పాత్ర పోషిస్తున్నాడు. మిస్టరీలను ఛేదించే పాత్రలో సుమంత్ నటించినట్టుగా చూపిస్తున్న ఇదం జగత్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. మరి అంచనాలకు తగినట్టుగా సినిమా వుందా లేదా అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.

Trending News