Shivarajkumar Vedha : వేద ఫస్ట్ లుక్.. పవర్ ఫుల్ రోల్‌లో శివ రాజ్‌కుమార్

Shivarajkumar Vedha కన్నడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన ఘోస్ట్, వేద వంటి పాన్ ఇండియన్ సినిమాలతో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడు. తాజాగా వేద సినిమాకు సంబంధించిన పోస్టర్ వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2023, 06:37 PM IST
  • కన్నడలో బిజీగా శివరాజ్‌కుమార్
  • వేద సినిమా తెలుగు పోస్టర్
  • పవర్ ఫుల్‌ పాత్రలో కన్నడ స్టార్
Shivarajkumar Vedha : వేద ఫస్ట్ లుక్.. పవర్ ఫుల్ రోల్‌లో శివ రాజ్‌కుమార్

Vedha Telugu Movie Poster: కన్నడ ఇండస్ట్రీలో శివ రాజ్‌కుమార్‌కి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. కన్నడ చక్రవర్తిగా శివ రాజ్‌కుమార్‌కు గణనీయమైన అభిమాన సైన్యం ఉంటుంది. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలుస్తుంటాయి. ఇప్పుడు ఆయన కూడా పాన్ ఇండియన్ సినిమాల మీద ఫోకస్ పెట్టేస్తున్నాడు.

శివ రాజ్‌కుమార్‌ త్వరలోనే వేద అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ మూవీ శివ రాజ్‌కుమార్‌ కి చాలా ప్రత్యేకమైంది. ఆయన కెరీర్‌లో ఇది  125వ చిత్రంగా రాబోతోంది. అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా వస్తుండటం మరో విశేషం.

ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగులోకి రాబోతోంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ  క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలైంది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది ఈ చిత్రంలో నటించారు.

Also Read:  Honey Rose Drinking : బాలయ్యతో కలిసి మందు కొడుతోందిగా.. హనీ రోజ్ యవ్వారం మామూలుగా లేదే

Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News