కేజీఎఫ్ 2 విడుదల తేదీ ఖరారు...

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, హోంబేలె ప్రొడక్షన్ కంపెనీ ద్వారా విజయ్ కిర్గండూర్ నిర్మించబోతోన్న కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల తేదీని శాండల్‌వుడ్ సూపర్ స్టార్ యష్ శుక్రవారం అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించారు. కాగా ఈ చిత్రం 

Last Updated : Mar 13, 2020, 10:43 PM IST
కేజీఎఫ్ 2 విడుదల తేదీ ఖరారు...

బెంగళూరు: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, హోంబేలె ప్రొడక్షన్ కంపెనీ ద్వారా విజయ్ కిర్గండూర్ నిర్మించబోతోన్న(KGFChapter2) కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల తేదీని శాండల్‌వుడ్ సూపర్ స్టార్ యష్ శుక్రవారం అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించారు. కాగా ఈ చిత్రం అక్టోబర్ 23న దసరా ట్రీట్‌గా ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. 

Read Also: కమల్ నాథ్ సర్కార్‌కి కష్టమొస్తే.. మధ్య ప్రదేశ్ సీఎం రేసులో ఉందెవరు?

 కేజీఎఫ్ చాప్టర్ 2 కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర యూనిట్ తెలిపింది. కేజీఎఫ్ చాప్టర్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'గేట్స్ ఆఫ్ నరాచి'' అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తన ట్విట్టర్ పేర్కొన్నారు. 

Also Read: ఐదు రాష్ట్రాల్లో హై అలెర్ట్..

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కేజీఎఫ్ చాప్టర్ 2లో నటించడం ద్వారా శాండల్ వుడ్ లో అరంగేట్రం చేయనున్నారు. సంజయ్ దత్  అధీరా పాత్రలో నటించనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. హోంబలే ఫిల్మ్స్‌ ద్వారా విజయ్ కిరాగండూర్ నిర్మించిన కేజీఎఫ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో ప్రధాన తారాగణమైన శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, రావు రమేష్ లు ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News