చిరంజీవి సరసన అనుష్క!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Last Updated : Aug 8, 2018, 09:55 AM IST
చిరంజీవి సరసన అనుష్క!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్‌ను రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. దాంతో పాటుగా సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులను కూడా పాత్రలకు తగ్గట్టు ఫైనలైజ్ చేసుకుంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం వెతికే పనిలో పడ్డాడట కొరటాల. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం, చిరుకు జోడీగా అనుష్కను హీరోయిన్‌గా తీసుకొనేందుకు కొరటాల ప్రయత్నిస్తుండగా.. అనుష్క ఈ ఆఫర్2ను అంగీకరించిందని తెలుస్తోంది. అయితే, ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రెండు పాత్రల్లో నటించనున్నారని, అందులో ఒకటి రైతు పాత్ర అని సమాచారం. కాగా ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఇంకా క్లారిటీ లేదు. మూవీ యూనిట్ కూడా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు.  ప్రస్తుతం చిరు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న’సైరా’ చిత్రంలో నటిస్తున్నారు. 'సైరా' తర్వాత ఈ మూవీ సెట్స్‌‌పైకి వెళ్లనుందని తెలిసింది. ఈ ఏడాది నవంబర్-డిసెంబ‌ర్‌లో ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. మరో విశేషమేమిటంటే.. ఈ చిత్రానికి కూడా రాంచరణే నిర్మాతట.  ఈ సినిమాను రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ - నిరంజన్ రెడ్డి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారని తెలిసింది.

Trending News