పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి.. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్'. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని రాజేష్ దొండపాటి తెరకెక్కించారు. ఆగస్ట్ 4న గ్రాండ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సినిమా నిర్మాత రఘురామ్ మూర్తి వెల్లడించిన విశేషాలు..
నేపథ్యం
ఉద్యోగరిత్యా నేను సాఫ్ట్ వేర్. చినప్పటి నుండి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. నేను ఆరేళ్ల వయసులో ఉన్నపుడే ఒక ఆలోచన పుట్టింది. మనం ఎపుడు సినిమాలు చూడటమేనా..? మనం ఎందుకు సినిమా తీయకూడదు అనే ఆలోచన వచ్చింది. అలా ఆ ఆలోచనతో సినీ ఇండస్ట్రీకి వచ్చాను.
'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్' సినిమా ఐడియా..
నేను హైదరాబాద్‌లో మైక్రో సాఫ్ట్‌లో పని చేస్తున్నపుడు.. ఒక మిత్రుడు కథలు రాస్తుండేవాడు. తాను ఎన్నో సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గానూ పని చేశాడు. ఆ పరిచయమే సినిమా ఇండ్రస్ట్రీ వైపు వచ్చేలా చేసింది. ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ను పరిచయం చేశాడు. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో కాదు ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ డైరెక్టర్ రాజేష్ దొండపాటి.
కుటుంబ సమేతంగా కలిసి అందురు సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలనే ఆలోచనతోనే ఈ సినిమా తీశాను. అలాంటి సినిమాలు ఇపుడు కాస్త తక్కువే. డైరెక్టర్ రాజేష్ ఆలోచనలు నా ఆలోచనలు ఒకేలా ఉండేవి. అలా మా ఇద్దరి ప్రయాణం ప్రారంభమై.. ఫ్యామిలీ అంత కలిసే సినిమా నిర్మించాం. ఈ సినిమాకి కొన్ని ఇన్ పుట్స్ కూడా ఇచ్చాను .
హీరో గురించి..
ఈ సినిమాలో హీరో గొర్రెల కాపరి.. చిన్నప్పుడే తండ్రి చనిపోతాడు.. తన తండ్రి కల ఏంటి..?? ఆ కలను నెరవేర్చటంలో హీరో ఏ పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేదే సినిమాలో ఉంటుంది. సినిమాలో హీరో 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్' అని పలుమార్లు ఉచ్చరించటం.. కృష్ణ గాడు అంటే ఒక రేంజ్' అని తన ఊరి వాళ్ళతో అనేలా చేశాడా లేదా అనేదే సినిమా కథ. రిష్వి మాకు పంపిన ఆడిషన్స్ వీడియోలు చూసి తీసుకున్నాం. తనని చూడగానే ఎదో కాస్త వెరైటీ మరియు కొత్త స్పార్క్ కనపడింది. హీరోయిన్ పాత్రకు చాలా మందిని చూసాం కానీ చివరికి విస్మయని తీసుకున్నాం.
Also Read: Janhvi Kapoor Bold Show: నెట్టింట మంటలు రేపిన జాన్వీ కపూర్.. బ్లూ లెహంగాలో అందాల జాతర
నిర్మాతగా తొలి సినిమా..
సినిమాలు తీయటం చాలా కష్టం అని చాలా మంది అంటుంటారు. కానీ నాకు మాత్రం అలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. ఎందుకంటే నేను మొత్తం అమెరికాలో ఉండేవాడిని.. నా ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని చూసుకునే వాళ్లు. అయితే మొదటి సినిమా.. అనుభవం కేకపోవటంతో బడ్జెట్ కాస్త అటు ఇటు అయింది. మొదటి సినిమాతో విజయం అందుకుంటామో లేదో తెలీదు కానీ.. నిర్మాతగా కొనసాగుతూనే ఉంటా.. సినిమాలు నిర్మిస్తూనే ఉంటా!
స్పూర్తి..
ఇండస్ట్రీలో దిల్ రాజు, అరవింద్, రామానాయుడు అంత ఎదగాలని అనుకుంటున్నాను. సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి క్రియేటివ్ వ్యక్తుల వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. వారే నాకు స్పూర్తి. ప్రస్తుతం అన్ని రకాలు చిత్రాలు చేయాలని ఉంది. ఎలాంటి డ్రీమ్ ప్రాజెక్టులేవీ లేవు.
సినిమా విడుదల విషయంలో దిల్ రాజు గారు, బెక్కెం వేణుగోపాల్ గారు సాయం చేస్తున్నారు. ఆగస్ట్ 4న సినిమా రిలీజ్ అవుతోంది. మూవీని రిలీజ్ చేయడమే అతి పెద్ద విజయంగా అనిపిస్తోంది... అంటూ ఇంటర్వ్యూ ముగించారు ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ నిర్మాత నిర్మాత పెట్లా రఘురామ్ మూర్తి.
Also Read: Kushi Title Song: 'ఖుషి' నుంచి నయా మెలోడీ.. టైటిల్ సాంగ్ అదిరింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి