హైదరాబాద్: కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ATM ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా మరోవైపు ఏటీఎం యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. కాగా ATM ట్రాన్సక్షన్‌లో 5వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఒకవేళ ఇదే అమల్లోకి వస్తే అంతకు మించి విత్ డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఇటీవల ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించింది.
Also Read: Coronil tablets: చిక్కుల్లో పతంజలి కరోనా మందు
ఇకపై ఏటీఎంలలో జరిపే అన్ని లావాదేవీలపై ఇంటర్ ఛేంజ్ ఛార్జీలను పెంచాలని సూచించినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలకు ఇది వర్తించేలా చేయాలని ఆర్బీఐని కోరింది. అలాగే 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏటీఎం చార్జీలను 24శాతం పెంచాలని, కమిటీ సమర్పించిన రిపోర్టును బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో కమిటీ నివేదిక అమలుకే రిజర్వ్ బ్యాంక్ మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏటీఎం యూజర్లపై మరింత భారం పడే అవకాశం ఉంది.
Also Read: Pak cricket team: పాక్ క్రికెట్ టీమ్‌కు కరోనా పాజిటివ్
హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..జీ