Pak cricket team: పాక్ క్రికెట్ టీమ్‌కు కరోనా పాజిటివ్

Pakistan cricket team: పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌పై కరోనా బౌన్సర్ పడింది. ఒక్కొక్కటిగా వికెట్లన్నీ కరోనా బౌన్సర్ ధాటికి రాలి పడుతున్నాయి. ముందుగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ రూపంలో ( Shahid Afridi) ఓ వికెట్ పడగా... అనంతరం మరో మూడు వికెట్లు పడ్డాయి. ఇప్పుడిక తాజాగా మరో ఏడు వికెట్లు రాలిపోయాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు ( England tour ) భారీ షాక్ తగిలింది. 

Last Updated : Jun 23, 2020, 10:07 PM IST
Pak cricket team: పాక్ క్రికెట్ టీమ్‌కు కరోనా పాజిటివ్

Pakistan cricket team: పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌పై కరోనావైరస్ బౌన్సర్ పడింది. ఒక్కొక్కటిగా వికెట్లన్నీ కరోనా బౌన్సర్ ధాటికి క్వారంటైన్ బాట పడుతున్నాయి. ముందుగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ( Shahid Afridi ) రూపంలో ఓ వికెట్ పడగా... అనంతరం మరో మూడు వికెట్లు పడ్డాయి. ఇప్పుడిక తాజాగా మరో ఏడు వికెట్లు రాలిపోయాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు ( England tour ) భారీ షాక్ తగిలింది. దాదాపు జట్టు సభ్యులంతా కరోనా బారిన పడ్డారు. టీమ్‌లోని 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో క్వారంటైన్‌కు ( Self Quarantine ) తరలిపోయారంతా. ఎప్పుడూ ఏదో ఓ వివాదంతో వార్తల్లో ఉండే పాక్ క్రికెటర్లు ఇప్పుడు కరోనా కారణంగా వార్తల్లోకెక్కారు. మొత్తం ఇప్పటివరకూ 11 మంది పాక్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా ( Pak cricketers tested corona positive ) నిర్థారణ అయింది. ( Also read: CoronaVirus కలకలం.. ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ )

ముందుగా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ కరోనావైరస్ బారిన పడిన విషయం తెలసిందే. కొద్దిరోజులకు ఆఫ్రిదీ కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా క్రికెట్ టీమ్ మొత్తాన్ని కరోనా వెంటాడుతోంది. నిన్న పాక్ క్రికెటర్లు హైదర్ అలీ, షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇవాళ తాజాగా మరో ఏడుగురు పాక్ టీమ్ క్రికెటర్లకు కరోనా సోకినట్టు తెలిసింది. పఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశిప్ భట్టి, మొహ్మద్ హఫీజ్, మొహ్మద్ హుస్సేన్, మొహ్మద్ రిజ్వాన్, వహాబ్ రియాజ్ లకు సైతం కరోనా సోకినట్టు ధృవీకరించారు. మరో ముగ్గురి రిపోర్టులు రావాల్సి ఉంది. ఇందులో పాక్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ ( Shoab malik ), జట్టు ప్రదాన కోచ్ వకార్ యూనుస్ ( Wakar yunus ), ఫిజియోథెరపిస్ట్ క్లిఫ్ డెక్లాన్‌ల నివేదికలు ఉన్నాయి. ఇవి కూడా పాజిటివ్‌గా తేలితే మొత్తం జట్టంతా కరోనాకు క్లీన్ బౌల్డ్ అయినట్టే. ( Also read: గంగూలీ ఫ్యామిలీలో కరోనా అలజడి.. మొత్తం నలుగురికి COVID19 పాజిటివ్ )

వాస్తవానికి కరోనా సంక్షోభం కారణంగా ఆలస్యమైన ఇంగ్లండ్ పర్యటనకు మరో వారం రోజుల్లో పాక్ క్రికెట్ జట్టు బయలుదేరాల్సి ఉంది. ఈ సిరీస్ కోసం ఎంపికైన 29 మంది పాక్ క్రికెటర్లకు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా... ఈ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. దాదాపు అందరికీ లక్షణాల్లేకపోవడంతో స్వీయ నిర్భంధంలో వెళ్లిన ఈ ఆటగాళ్లందర్నీ పీసీబీ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News