గ్రాండ్ గా ‘మహానటి’ ఆడియో లాంచ్

Last Updated : Apr 26, 2018, 04:17 PM IST
గ్రాండ్ గా ‘మహానటి’ ఆడియో లాంచ్

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘మహానటి’ హంగామా కనిపిస్తుంది. రీసెంట్‌గా రిలీజైన ‘మూగ మనసులు’ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే స్పీడ్‌లో రేపు ఈ సినిమా సెకండ్ సింగిల్‌ని రిలీజ్ చేయనున్న ఫిల్మ్ మేకర్స్  మే   1 న గ్రాండ్‌గా ఆడియో రిలీజ్ చేయనున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అటెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ ఈవెంట్ ప్రిపరేషన్స్‌లో  బిజీగా  ఉన్న  మహానటి ఫిల్మ్ మేకర్స్, త్వరలో ఈ ఆడియో లాంచ్  ఈవెంట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు అనౌన్స్ చేయనున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా మహానటి. కీర్తిసురేష్ సీనియర్ నటి ‘సావిత్రి’ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా మే 9వ తేదిన రిలీజవుతుంది.  మిక్కీ జె. మేయర్  ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు

Trending News