106 ఏళ్ల వృద్ధురాలైన వీరాభిమానిని కలిసిన మహేష్ బాబు

106 ఏళ్ల వృద్ధురాలైన వీరాభిమానిని కలిసిన మహేష్ బాబు

Last Updated : Nov 26, 2018, 08:33 PM IST
106 ఏళ్ల వృద్ధురాలైన వీరాభిమానిని కలిసిన మహేష్ బాబు

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్నివర్గాల్లోనూ అన్ని వయసుల వాళ్లకూ మహేష్ బాబు అంటే ఎనలేని అభిమానం. అలాగే ఓ 106 ఏళ్ల బామ్మకు కూడా మహేష్ బాబు అంటే ఎంతో క్రేజ్. ఆ బామ్మ గురించి, ఆమెకు తనపై ఉన్న అభిమానం గురించి తెలుసుకున్న మహేష్ బాబు.. మహర్షి సినిమా సెట్స్‌లోనే ఆమెను కలిసినట్టు తెలుస్తోంది. స్వయంగా మహేష్ బాబు అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్న ఓ వీడియోలో మహేష్ బాబు ఆ బామ్మను కలిసి ఆప్యాయంగా ముచ్చటిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఆ బామ్మ సైతం మహేష్ బాబుని చూసి ఎంతో సంబరపడుతున్న వైనాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.

Trending News