సమంత రిటైర్డ్‌మెంట్‌పై చైతూ రియాక్షన్

                                 

Last Updated : Jul 9, 2018, 05:16 PM IST
సమంత రిటైర్డ్‌మెంట్‌పై చైతూ రియాక్షన్

అక్కినేని వారి కోడలు సమంత ఇక సినిమాలకు గుడ్ చెబుతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త ప్రాజెక్టులను ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ ఊగాహానాలకు బలాన్ని ఇచ్చాయి. దీనిపై సమంత భర్త నాగ చైతన్య స్పందించాడు. సమంతకి సినిమాలంటే చాలా ఇష్టం..ఆమె సినీ రంగానికి ఎప్పటికీ దూరం కాదు... అయితే  చిన్నపాటి బ్రేక్ తీసుకోవచ్చని వివరణ ఇచ్చారు. సమంత రిటైర్డ్‌మెంట్‌పై వస్తున్న అసత్య వార్తలకు ఇకనైనా స్వస్తి చెప్పాలని మీడియాను కోరారు. చైతు రియాక్షన్ బట్టి చూస్తే సమంత సినిమాలకు శాశ్వతంగా దూరం కాకపోయినప్పటికీ చిన్నపాటి బ్రేక్ తీసుకుంటుందనేది స్పష్టమౌతుంది. 

ప్రస్తుతం సమంత తమిళంలో రెండు, తెలుగులో ఒక భారీ ప్రాజెక్టుకు ఒప్పకున్నట్లు తెలిసింది. ఈ మూడు ప్రాజెక్టులతో పాటు ఆమె భర్త నాగచైతన్యతో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో ఆమె కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పడం లేదట. దీంతో 2019లో సమంత సినిమాలకు గుడ్ బై చెబుతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా సమంత రిటైర్డ్‌మెంట్‌పై చైతూ ఇచ్చిన క్లారిటీతో అభిమానులు ఊరిపి పీల్చుకుంటున్నారు.

Trending News