Ante Sundaraniki TRP Rating : ఇది మరీ దారుణం.. నీచస్థాయిలో నాని సినిమా

Nani Ante Sundaraniki నాని అంటే సుందరానికీ సినిమా థియేటర్లోనే మిక్స్డ్ టాక్‌తో ఓ మోస్తరుగా కలెక్షన్లను సాధించింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ చూసి అంతా షాక్ అవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2022, 05:59 PM IST
  • నాని సినిమాకు దారుణమైన రేటింగ్
  • రెండు కంటే తక్కువ రేటింగ్‌తో నాని సినిమా
  • శాటిలైట్ హక్కులపై గందరగోళం
Ante Sundaraniki TRP Rating : ఇది మరీ దారుణం.. నీచస్థాయిలో నాని సినిమా

Ante Sundaraniki TRP Rating : నేచురల్ స్టార్ నాని సినిమాలకు బుల్లితెర, వెండితెరపై మంచి క్రేజ్ ఉంటుంది. నాని నటన కోసమైనా ప్రేక్షకులు సినిమాలు చూస్తుంటారు. అయితే ఈ మధ్య నాని సినిమాలకు అంతగా కలెక్షన్లు రావడం లేదు. శ్యామ్ సింగ రాయ్ సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా.. కలెక్షన్ల పరంగా అంత ఊపందుకోలేదని టాక్. నిర్మాతలకు అంత లాభం చేకూర్చే ప్రాజెక్ట్‌ కాదని అంతా అనేశారు. ఇక నాని నటించిన అంటే సుందరానికీ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా పర్ఫామ్ చేయలేకపోయింది.

నాని నజ్రియ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన ఈ మూవీ మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద లాభాలను తీసుకురాలేకపోయింది. సినిమా నిడివి వల్లే ఫలితం తేడా కొట్టేసింది. కథ,కథనాలు కూడా కాస్త సాగదీసినట్టుగా అనిపించడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యారు.

నాని నటన, నజ్రియా స్క్రీన్ ప్రజెన్స్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్‌గా మారాయి. అయితే కలెక్షన్ల పరంగా ఈ సినిమా అంతగా వర్కవుట్ కాలేదు. ఓటీటీలోనూ ఈ సినిమా అంతగా క్లిక్ అవ్వలేదు. అయితే బుల్లితెరపై ఈ సినిమా వర్కవుట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించనట్టుగా టీఆర్పీ రేటింగ్ వచ్చేసింది.

నాని సినిమాలకు ఇంత తక్కువ రేటింగ్ రావడం ఇదే మొదటి సారి. అసలు ఓ స్టార్ హీరో సినిమాకు ఇటువంటి రేటింగ్ ఇదే ఫస్ట్ టైం. మినిమిం పది లేదా తొమ్మిది రేటింగ్ వస్తుంది. అసలే ఇప్పుడు బుల్లితెరపై స్టార్ హీరోల సినిమాకు కాలం చెల్లినట్టు అనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సైతం 20 లోపు రేటింగ్ సాధించింది. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట వంటి చిత్రాలకు పదిలోపు రేటింగ్ వచ్చింది.

ఇలాంటి తరుణంలో నాని సినిమాకు రెండు లోపు రేటింగ్ రావడంతో అంతా షాక్ అవుతున్నారు. జెమినీలో వేసిన ఈ మూవీ అర్బన్‌లో 1.88, అర్బన్ ప్లస్ రూరల్‌లో 1.68 రేటింగ్ సాధించింది. అలా అంటే సుందరానికీ సినిమాకు రెండు లోపు రేటింగ్ రావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. మహేష్‌ బాబు అభిమానులు నాని సినిమా రేటింగ్‌ను చూసి జాలి పడుతున్నారు.

Also Read : ప్రియుడితో పెళ్లి వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ వింత రియాక్షన్.. కొత్త అనుమానాలు!

Also Read : Vijay Antony Divorce : మూడో వ్యక్తి మధ్యలోకి దూరితే అంతేనట.. విడాకులపై విజయ్ ఆంటోని

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News