నాని క్రికెటర్‌గా నటించిన జెర్సీ మూవీ టీజర్

నాని క్రికెటర్‌గా నటించిన జెర్సీ మూవీ టీజర్

Updated: Jan 12, 2019, 12:35 PM IST
నాని క్రికెటర్‌గా నటించిన జెర్సీ మూవీ టీజర్
Source : Youtube@Sithara Entertainments

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాని ఓ క్రికెటర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న జెర్సీ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ అనే జమ్మూకాశ్మీర్ బ్యూటీ జంటగా నటించింది. తమిళ, కన్నడ, మళయాళం చిత్రాల్లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కమ్ర ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ తమిళ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఇటీవల బిగ్ బాస్ 2వ సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన నాని.. దేవదాస్ లాంటి మల్టీస్టారర్ తర్వాత నటిస్తున్న సినిమా ఇదే.