July 2023 Changes: జూలై 1 నుంచి ఏయే అంశాల్లో మార్పులుంటాయి, గ్యాస్ ధర తగ్గనుందా

July 2023 Changes: కొత్త నెల ప్రారంభమౌతుందంటే చాలు టెన్షన్ మొదలౌతోంది. మళ్లీ గ్యాస్ ధరలు పెరుగుతాయా లేదా అనే ఆందోళన వెంటాడుతోంది. ప్రతి నెలా 1వ తేదీన కొన్నింటిలో మార్పులు వస్తుంటాయి. ఆ ప్రభావం మనపైనే పడుతుంటుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 26, 2023, 05:24 PM IST
July 2023 Changes: జూలై 1 నుంచి ఏయే అంశాల్లో మార్పులుంటాయి, గ్యాస్ ధర తగ్గనుందా

July 2023 Changes: ప్రతి నెలా మొదటి తారీఖున వచ్చినట్టే ఈసారి కూడా చాలా మార్పులు చేర్పులు చోటుచేసుకోవచ్చు. మరో నాలుగు రోజుల్లో జూలై నెల ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈసారి చోటుచేసుకునే మార్పులు మన ఆర్ధిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుందో లేదా తెలుసుకుందాం..

ప్రతి నెలా 1వ తేదీన చోటుచేసుకునే మార్పులు ఆయా వ్యక్తుల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తుంటాయి. మరో నాలుగు రోజుల్లో జూలై నెల ప్రారంభం కానున్న నేపధ్యంలో ఎలాంటి మార్పులుంటాయోననే ఆసక్తి నెలకొంది. మార్పులైతే కచ్చితంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఎల్పీజీ సిలెండర్ ధరలు, సీఎన్జీ-పీఎన్జీ గ్యాస్ ధరల విషయంలో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ సిలెండర్ ధరలపై సమీక్ష చేస్తుంటుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లోని ఒకటవ తేదీన కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరల్ని తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. డొమెస్టిక్ గ్యాస్ ధరల్ని తగ్గించలేదు. ఈసారి కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరలతో పాటు డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరల్ని కూడా తగ్గించవచ్చని అంచనా ఉంది. 

అదే విధంగా క్రెడిట్ కార్డు వినియోగం విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. జూలై 1, 2023 నుంచి విదేశాల్లో క్రెడిట్ కార్డు ఖర్చులపై టీసీఎస్ వసూలు చేసే అవకాశముంది. ఈ నిబంధన ప్రకారం ఒకవేళ మీ ఖర్చు 7 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే 20 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. విద్యా వైద్య ఖర్చులపై 5 శాతం టీసీఎస్ వసూలు చేయనున్నారు. విదేశాల్లో చదువు నిమిత్తం అప్పు తీసుకునే ట్యాక్స్ పేయర్లపై 7 లక్షల కంటే ఎక్కువ డబ్బైతే 0.5 శాతం టీసీఎస్ వసూలు చేస్తారు. 

ప్రతినెలా మొదటి తేదీన లేదా మొదటి వారంలో ఎల్పీజీ గ్యాస్ ధరల్లానే సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరల్లో మార్పు ఉండవచ్చు. ఢిల్లీ, ముంబై సహా ఇతర నగరాల్లో ఆయిల్ కంపెనీలు మొదటి వారంలోనే సీఎన్జీ-పీఎన్జీ థరల్లో మార్పులు చేయవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకునే జూలై 1 నుంచి చాలా వస్తువుల ధరలు మారవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరల విషయంలోనే సందిగ్దత ఏర్పడింది. గ్యాస్ ధరలు పెరుగుతాయా లేదా అనే విషయంలో స్పష్టత రావల్సి ఉంది.

Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News