పెళ్లి కూతురుకు కరోనా పాజిటివ్.. వేడుకకు హాజరైన 32 మందిని క్వారంటైన్ కు తరలింపు..

కరోనా భయంకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విచిత్రమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పెళ్లి చేసుకున్న ఓ జంట అంతా సవ్యంగా జరిగిందనుకునే లోపే  పెళ్లికూతురుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో

Updated: May 22, 2020, 10:08 PM IST
పెళ్లి కూతురుకు కరోనా పాజిటివ్.. వేడుకకు హాజరైన 32 మందిని క్వారంటైన్ కు తరలింపు..

భోపాల్: కరోనా భయంకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విచిత్రమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పెళ్లి చేసుకున్న ఓ జంట అంతా సవ్యంగా జరిగిందనుకునే లోపే  పెళ్లికూతురుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా బంధువులు ఆశ్చ్యర్యానికి గురయ్యారు. దీంతో వధూవరుల కుటుంబసభ్యులతో పాటు పెళ్లికి హాజరైన అందరిలో కలవరం మొదలైంది. కాగా ఈ ఘటన మధ్యప్రదేశ్ భోపాల్ సమీపంలోని జట్ ఖేడి ప్రాంతంలో చోటుచేసుకుంది.

Also Read: Temperature updates : ఎండలతో హీటెక్కిన ఢిల్లీ.. తెలంగాణ, ఏపీలోనూ మండుటెండలు

ఇదిలాఉండగా లాక్ డౌన్ నిబంధనలకు లోబడే రెండు రోజుల క్రితం ఈ వివాహం జరిగింది. అతి తక్కువ మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి కార్యక్రమాలను ముగించారు. అయితే పెళ్లికూతురు అప్పటికే స్వల్ప జ్వరంతో బాధపడుతోందని, కాకపోతే మందులు వాడుతుండడంతో ఆరోగ్యంగా కనబడుతోందని, తమకు ఏమాత్రం అనుమానం రాలేదని బంధువులన్నారు. అయితే కాసేపటికే జ్వరం మరింత ఎక్కువ కావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమెతో పాటు మొత్తం పెళ్లికి హాజరైన 32 మంది బంధువులను క్వారంటైన్ కు తరలించారు.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..