నితిన్ చేతుల మీదుగా విడుదలైన 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ' ఫస్ట్ లుక్

'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ' ఫస్ట్ లుక్

Last Updated : Nov 4, 2018, 03:22 PM IST
నితిన్ చేతుల మీదుగా విడుదలైన 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ' ఫస్ట్ లుక్

కిషోర్ కుమార్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ సినిమా ఫస్ట్ లుక్ ఇవాళ నితిన్ చేతుల మీదుగా విడుదలైంది. కొంత బ్రేక్ తర్వాత కన్నడ నటి రాయ్ లక్ష్మి మళ్లీ తెలుగులో పూర్తిస్థాయి నిడివి ఉన్న పాత్ర చేస్తున్న చిత్రం ఇది. రాయ్ లక్ష్మీతోపాటు రంగస్థలం ఫేమ్ పూజిత పొన్నాడ ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ఇద్దరినీ చెరో సగంగా ఉన్నట్టుగా చూపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ చూడ్డానికి ఆసక్తి రేకెత్తించేదిగానే ఉంది. ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహత్, పంకజ్ సైతం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ యూనిట్ సభ్యులకు నితిన్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

 

 

 

Trending News