Prabhas stood First in ORMAX Media August 2022 List: సోషల్ మీడియాలో పాపులారిటీని బట్టి ప్రతినెలా ఆర్మాక్స్ మీడియా సంస్థ మోస్ట్ పాపులర్ తెలుగు మేల్ స్టార్స్ అలాగే మోస్ట్ పాపులర్ తెలుగు ఫిమేల్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో గత నెల లాగానే ఆగస్టు నెలకి కూడా ప్రభాస్ మొదటి స్థానం దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రభాస్ సరైన హిట్టు అందుకుని చాలా కాలమే అయింది.
బాహుబలి తర్వాత హిట్ అనే పదమే ఆయనకు దూరమైంది. కానీ ఆయన క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. చివరిగా రాధేశ్యామ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నాడు. అయినా సరే ఆయనకు తెలుగు ప్రేక్షకులలో క్రేజ్ తగ్గకపోవడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు అనూహ్యంగా కన్నుమూశారు. ఆ సమయంలో ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు ప్రభాస్ అభిమానులు, కృష్ణంరాజు గారి అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్ వచ్చారు.
వారందరూ తిండి విషయంలో ఇబ్బంది పడకూడదని అప్పటికప్పుడు వారందరికీ భోజనాలు తెప్పించి పెట్టించారట ప్రభాస్. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఇక ఈ జాబితాలో ప్రభాస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ వంటి వారి టాప్ టెన్ లో నిలిచారు. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించబడిన వారి పేర్లు ఈ జాబితాలోకి వస్తాయని అంటున్నారు.
ఇక ఇదంతా హీరోల విషయం అయితే హీరోయిన్ల విషయంలో కూడా ఎప్పటిలాగే సమంత టాప్ ప్లేస్ లో నుంచింది. తర్వాత కాజల్ అగర్వాల్, అనుష్క, సాయి పల్లవి, పూజ హెగ్డే, కీర్తి సురేష్, తమన్నా, రష్మిక మందన, కృతి శెట్టి, రాశి కన్నా కూడా ఈ జాబితాలో నిలిచారు. హిట్ లతో సంబంధం లేకుండానే ప్రభాస్ టాప్ ప్లేస్ లో నిలబడటం అనేది ఒక రకంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పక తప్పదు. సరైన హిట్ సినిమా లేకపోతేనే ఆయన ఇలా ఉన్నారంటే ఆదిపురుష్ లేదా సలార్ లాంటి సినిమాతో మరోసారి హిట్టు కొడితే కనుక ఆయనను ఆపడం ఎవరి తరం కాదనే వాదన వినిపిస్తోంది.
Also Read: Aa Ammayi Gurinchi Meeku Cheppali Review: సుధీర్ బాబు-కృతి శెట్టిల సినిమా ఎలా ఉందంటే?
Also Read: Mahesh Babu Couple with Weavers: చేనేత మహిళలకు మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ చేయుత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి