తెలుగులో ప్రియా ప్రకాశ్ వారియ‌ర్ మూవీ!

సామాజిక మాధ్యమాల్లో తన క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప్రియా ప్రకాశ్ వారియ‌ర్‌కి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫాలోవ‌ర్స్ రోజురోజుకి పెరుగుతున్నారు.

Last Updated : Apr 8, 2018, 05:35 PM IST
తెలుగులో ప్రియా ప్రకాశ్ వారియ‌ర్ మూవీ!

సామాజిక మాధ్యమాల్లో తన క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప్రియా ప్రకాశ్ వారియ‌ర్‌కి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫాలోవ‌ర్స్ రోజురోజుకి పెరుగుతున్నారు. 18 ఏళ్ళ ఈ భామ‌ నటించిన తొలి చిత్రం 'ఒరు ఆదార్ ల‌వ్'‌. ఈ మ‌ల‌యాళ మూవీలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ అనే పాట‌లో తన క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌‌తో యువ‌త గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ అమ్మడు.

తాజాగా ప్రియా ఇమేజ్‌ని, క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాల‌ని చూస్తోందట చిత్ర యూనిట్. 'ఒరు ఆదార్ ల‌వ్‌' మూవీ గతనెలలోనే విడుదల కావలసి ఉన్నా.. ఇటీవలి పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రంలోని 40 శాతం స‌న్నివేశాల‌ని రీషూట్ చేయాల‌ని చిత్ర బృందం భావిస్తోంది. 'ఒరు ఆదార్ ల‌వ్‌' మూవీలో మొత్తం న‌లుగురు హీరోయిన్స్ ఉండ‌గా అందులో ప్రియా వారియ‌ర్ ఒక‌రు. సినిమాలో ఆమె పాత్ర కేవ‌లం 15 నుండి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంద‌ట‌. అయితే ప్రియా పాత్రని ఇంకాస్త పెంచి మూవీపై జ‌నాల‌లో ఆసక్తిని క‌లిగించాల‌ని చిత్ర యూనిట్ భావిస్తున్నార‌ట‌. ఇందుకోసం రీషూట్ కూడా చేసేందుకు సిద్ధమ‌య్యార‌ని టాక్‌. దీంతో ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుంద‌ని స‌మాచారం.

ఇప్పుడు ప్రియా నేషనల్ ఐకాన్‌గా మారడంతో.. 'ఒరు ఆదార్ ల‌వ్' సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది డబ్బింగ్ వెర్షన్‌గా ఉంటుంది. ఇదే జరిగితే.. దేశం యావత్తు ఆమె నటనను చూస్తుంది.

Trending News