చైతూ‌తో మరో సినిమాకు ఓకే చెప్పిన రకుల్

                                                             

Updated: Jun 13, 2018, 02:20 PM IST
చైతూ‌తో మరో సినిమాకు ఓకే చెప్పిన రకుల్

రియల్ లైఫ్ మామ-అల్లుళ్లు వెంకటేశ్, నాగచైతన్య కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. బాబి దర్శకత్వంలో రాబోతున్న ఈ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ ప్రాజెక్టులోకి ఓ హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు టాక్.

తాజా స‌మ‌చారం ప్ర‌కారం ఈ సినిమాలో రకుల్,  చైత‌ూకు జోడీగా న‌టించ‌నుంద‌ట‌. మ‌రి ఇందులో వెంక‌టేశ్ జ‌త‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై క్లారిటీ రాలేదు. చైత‌న్య, ర‌కుల్ క‌లిసి గతంలో `రారండోయ్ వేడుక చూద్దాం` సినిమా చేశారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో క‌లిసి పీపుల్ మీడియా బ్యాన‌ర్ నిర్మించ‌నుంది.