‘ఎన్టీఆర్’ బయోపిక్: వైరలవుతున్న రానా లీక్ ఫోటో

‘ఎన్టీఆర్’ బయోపిక్: వైరలవుతున్న రానా లీక్ ఫోటో

Updated: Sep 8, 2018, 06:49 PM IST
‘ఎన్టీఆర్’ బయోపిక్: వైరలవుతున్న రానా లీక్ ఫోటో

నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’.  నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్ (శ్రీదేవి పాత్రలో), ప్రకాష్ రాజ్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి తెలిసిందే! కొన్ని రోజుల క్రితమే రానా దగ్గుబాటి షూటింగ్‌ని మొదలుపెట్టారు. అయితే ఈ చిత్రంలో రానా దగ్గుబాటి ఫోటోలు లీకై.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానా బరువు కూడా తగ్గారట. లీకైన ఫొటోలో రానా తెల్లటి షర్టు, పాయింట్ ధరించి నడుస్తూ.. అప్పట్లో ఉన్న చంద్రబాబుని గుర్తుచేశారు.

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నివాసంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

‘ఎన్టీఆర్' బయోపిక్ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో సుమంత్, సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌లు నటించనున్నట్లు సమాచారం.