డబ్బును చూసి నటించాడు?

తాజాగా రవితేజ నటించిన చిత్రం 'నేల టికెట్టు'.

Last Updated : May 27, 2018, 04:54 PM IST
డబ్బును చూసి నటించాడు?

తాజాగా రవితేజ నటించిన చిత్రం 'నేల టికెట్టు'. ఇందులో రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించింది. మే 24న విడుదలైన ఈ సినిమా యువత, సమాజం, మానవతా విలువలు వంటి అంశాలతో తెరకెక్కింది. అయితే ఈ  'నేల టికెట్టు' సినిమాను రవితేజ డబ్బు కోసం చేసినట్లు తెలుస్తోంది. కెరీర్‌లో అత్యధికంగా ఈ సినిమాకు రూ.12 కోట్లు పారితోషికం పొంది.. స్క్రిప్ట్‌ను పట్టించుకోలేదని డీసీ ఓ కథనంలో పేర్కొంది.

జగపతి బాబుకు రూ.3 కోట్ల పారితోషికం ఇచ్చారట. అటు చిత్రంలోని ఇంకొందరు నటులూ ఇదే కారణంతో ఇందులో కన్పించారట. కళ్యాణ్ కృష్ణ 3 సంవత్సరాలు రాసిన తర్వాత, చాలా మంది నటులు తిరస్కరించిన కథను.. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూ.25 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. 

ప్రస్తుతం శ్రీను వైట్లతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటిస్తున్న రవితేజ మరోవైపు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘తేరి’ రిమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాకు కూడా సైన్ చేసేశాడు. ఈ రెండు సినిమాలను ఒకేసారి పూన్తి చేసి ఆ తర్వాత వి.ఐ ఆనంద్‌తో ఓ సినిమా.. అలాగే మరో డైరెక్టర్‌‌తో ఓ సినిమా చేసే ప్లాన్ చేసుకుంటున్నాడు.

Trending News