Sarileru neekevvaru pre release event today : నేడే 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఫంక్షన్

సంక్రాంతి పండగకు సందడి చేయనున్న తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Last Updated : Jan 5, 2020, 01:02 PM IST
Sarileru neekevvaru pre release event today : నేడే 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఫంక్షన్

సంక్రాంతి పండగకు సందడి చేయనున్న తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇవాళ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో  ఏర్పాటు చేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం సినిమా యూనిట్ ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం జరగనున్న వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గోనున్నారు. సూపర్ స్టార్, మెగాస్టార్ కలిసి పాల్గోనున్న ఈవెంట్ కావడంతో అటు చిరు అభిమానులు ఇటు మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పటికే ఈవెంట్ కోసం అభిమానులు హైదరాబాద్ తరలివస్తున్నారు. 
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ రోడ్లన్నీ చిరు, మహేష్ అభిమానులతో రద్దీగా మారాయి. పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి నెలకొంది. 

జనవరి 11న సినిమా విడుదల 
'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో విజయ శాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత విజయ శాంతి మళ్లీ తెలుగు తెరపై కనిపిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News