మహేష్ బాబు దర్శకుడితో నాని సినిమా!

నానితో సినిమా ప్లాన్ చేస్తున్న దర్శకుడు 

Last Updated : Oct 24, 2018, 06:35 PM IST
మహేష్ బాబు దర్శకుడితో నాని సినిమా!

సున్నితమైన అంశాల ఆధారంగా కథ రాసుకుని, ఆడియెన్స్‌ని ఆకట్టుకునే కుటుంబకథా చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తాజాగా మరో కుటుంబకథా చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు, వెంకీ హీరోలుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత బ్రహ్మోత్సవం సినిమాతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈసారి గట్టిగా సినిమాను ప్లాన్ చేస్తున్న ఈ దర్శకుడు తన అప్ కమింగ్ సినిమా కోసం న్యాచురల్ స్టార్ నానిని హీరోగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 

శ్రీకాంత్ అడ్డాల వినిపించిన కథ విన్న గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకొచ్చినట్టు సమాచారం. నాన్ని ప్రస్తుతం చేస్తోన్న జెర్సీ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కే విధంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోవాల్సిందిగా అల్లు అరవింద్ శ్రీకాంత్ అడ్డాలకు సూచించాడట. ఇద్దరు అన్నాదమ్ముళ్ల చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాల-నాని కాంబినేషన్ లో మొదటిది కానుంది.

Trending News