SSR autopsy report: సుశాంత్ పోస్టుమార్టం నివేదికపై అనేక అనుమానాలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం నివేదికలో ( Sushant Singh Rajput autopsy report ) అతడు చనిపోయిన సమయాన్ని డాక్టర్లు ఎందుకు పేర్కొనలేదనే సందేహం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Last Updated : Aug 24, 2020, 10:45 PM IST
SSR autopsy report: సుశాంత్ పోస్టుమార్టం నివేదికపై అనేక అనుమానాలు

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం నివేదికలో ( Sushant Singh Rajput autopsy report ) అతడు చనిపోయిన సమయాన్ని డాక్టర్లు ఎందుకు పేర్కొనలేదనే సందేహం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా.. తాజాగా ఇదే విషయంపై ఎయిమ్స్ ఆసుపత్రి ఫోరెన్సిక్ సైన్స్ ( Forensic science ) విభాగం అధిపతి సుధీర్ గుప్తా సైతం పలు సందేహాలు వ్యక్తంచేశారు. టైమ్స్ నౌ ఛానెల్ ప్రసారం చేసిన ఓ కథనం ప్రకారం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆటాప్సీ రిపోర్టులో అతడు చనిపోయినప్పటి సమయాన్ని పేర్కొనకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సుధీర్ గుప్తా.. ఈ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయంటూ సీబీఐకి ( CBI ) చెప్పినట్టు తెలుస్తోంది. తమ ఛానెల్ తో మాట్లాడుతూ సుధీర్ గుప్తా ఆ వివరాలు వెల్లడించినట్టుగా టైమ్స్ నౌ పేర్కొంది. Also read : Honey trap: సెక్స్ వర్కర్‌తో ఐఎస్ఐ హనీ ట్రాప్.. ఒకరు అరెస్ట్

ఇదిలావుంటే, గత మూడు రోజుల్లో రెండోసార్లు కూపర్ హాస్పిటల్‌కి ( Cooper hospital ) వెళ్లిన సీబీఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. అక్కడ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టంలో పాల్గొన్న వైద్యులను పలుమార్లు ప్రశ్నించి వారి నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో వైద్యులు చెప్పిన సమాధానాలతో పాటు సుశాంత్ పార్థివదేహానికి సంబంధించిన (  Sushant Singh Rajput mortal remains photos) ఫోటోలు తీసిన తీరుపై సీబీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. Also read : Haryana CM ML Khattar: హర్యానా ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

Trending News