ఈ ఐదు పాటిస్తే.. మరో పదేళ్లు బ్రతకొచ్చు

జీవనశైలిలో ఈ ఐదు అలవాట్లను పాటిస్తే.. ఆయుష్షు పెంచుకోవచ్చని అమెరికా పరిశోధకులు చెప్తున్నారు.

Updated: May 1, 2018, 01:23 PM IST
ఈ ఐదు పాటిస్తే.. మరో పదేళ్లు బ్రతకొచ్చు

జీవనశైలిలో ఈ ఐదు అలవాట్లను పాటిస్తే.. ఆయుష్షు పెంచుకోవచ్చని అమెరికా పరిశోధకులు చెప్తున్నారు. ఆయుష్షును పెంచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి...? నిండు నూరేళ్లు బతకాలని ప్రతి మనిషికీ ఆశ ఉంటుంది. అయితే కొన్ని అలవాట్లను పాటించకపోవడం వల్ ఆయుష్షు తగ్గిపోతుందని అంటున్నారు పరిశోధకులు. 

ఈ ఐదురకాల అలవాట్లతో దీర్ఘకాలంపాటు బ్రతకొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. అవేంటో మనమూ తెలుసుకుందాం..!

* ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం

* ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండడం

* ఆల్కహాల్‌ తీసుకోకపోవడం

* పొగతాగకపోవడం

ఈ ఐదు పాటిస్తే సాధారణం ఆయుష్షుతో పోలిస్తే మనిషి ఆయుర్దాయం సగటున 10 సంవత్సరాలు పెరుగుతుందని అమెరికాలోని స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనలో భాగంగా 78,865 మంది మహిళల 34 ఏళ్ల డేటాను, 44,354 మంది పురుషుల 27 ఏళ్ల డేటాను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.