సూపర్ స్టార్ రజనీకాంత్ 165వ సినిమా టైటిల్ వచ్చేసింది

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ 165వ సినిమా టైటిల్‌ను ఎట్టకేలకు ప్రకటించారు. 

Last Updated : Sep 7, 2018, 11:49 PM IST
సూపర్ స్టార్ రజనీకాంత్ 165వ సినిమా టైటిల్ వచ్చేసింది

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ 165వ సినిమా టైటిల్‌ను ఎట్టకేలకు ప్రకటించారు. కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించే ఈ చిత్రానికి  ‘పేట్టా’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్‌కి ఇప్పటికే ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో తెగ లైకులు, షేరులు వస్తున్నాయి. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. విజయ్‌ సేతుపతి, సిమ్రన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, బాబీ సింహా, గురు సోమసుందరం, మేఘా ఆకాశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తిరు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తుండగా.. వివేక్ హర్షన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 2018 నెలలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ డార్జిలింగ్‌లో జరిగింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానరుపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి డిఫరెంట్ లుక్‌తో ఈ చిత్రంలో రజనీకాంత్ నటించడం విశేషం. 

మరొక విషయమేమిటంటే.. రజనీకాంత్ నటించిన ‘2.ఓ’ సినిమా టీజర్‌ను సెప్టెంబరు 13న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్‌, అక్షయ్‌ కుమార్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నవంబరు 29 తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుక సన్నాహాలు జరుగుతున్నాయి. 

Trending News