‘గుడ్ లక్ సఖీ’ అంటోన్న Dil Raju

డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ సాధించి దిల్ సినిమాతో నిర్మాతగా మారారు రాజు. అలా దిల్ రాజుగా మారిన తర్వాత ఎన్నో కుటంబ కథా చిత్రాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలు నిర్మించి ప్రముఖ నిర్మాతగా ఎదిగారు.

Last Updated : May 12, 2020, 09:07 AM IST
‘గుడ్ లక్ సఖీ’ అంటోన్న Dil Raju

డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ సాధించి దిల్ సినిమాతో నిర్మాతగా మారారు రాజు. అలా దిల్ రాజుగా మారిన తర్వాత ఎన్నో కుటంబ కథా చిత్రాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలు నిర్మించి ప్రముఖ నిర్మాతగా ఎదిగారు. మొదటి భార్య అనిత మూడేళ్ల కిందట చనిపోగా, కూతురు హన్షిత రెడ్డి ప్రోద్బలంతో ఆదివారం రాత్రి వైఘారెడ్డి (తేజస్విని)తో దిల్ రాజు రెండో వివాహం చేసుకోవడం తెలిసిందే. దిల్ రాజు పెళ్లిపై కూతురు ఏమన్నారంటే!

ఇక కెరీర్ విషయానికొస్తే దిల్ రాజుకు సినిమాలపై, ప్రేక్షకుల నాడిపై పట్టుంది. టైటిల్‌తో పాటు కథ విషయంలోనూ దిల్ రాజు మార్క్ కనిపిస్తుంది. అయితే ప్రముఖ దర్శకుడు నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు తొలుత అనుకున్న టైటిట్‌ దిల్ రాజుకు అంతగా నచ్చలేదని తెలుస్తోంది.  నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు

ఆ సినిమాకు ‘గుడ్ లక్ సఖీ’ టైటిల్‌ను నిర్మాత దిల్ రాజు ఖరారు చేశారట. పెళ్లికి కొన్ని రోజుల ముందు ఈ టైటిల్ వైపు ఆయన మొగ్గుచూపడం విశేషం. పాతతరంతో పాటు ఇప్పటి యువతరాన్ని సైతం ఆకట్టుకునేలా టైటిల్ ఉందని టీమ్‌తో చర్చించారట. జగపతిబాబు, ఆది పినిశెట్టి, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో క్రీడా నేపథ్యంలో దర్శకుడు నగేశ్ కుకునూర్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. పెళ్లికి ముందే దిల్ రాజు భార్య పేరు మార్పు!

‘హైదరాబాద్ బ్లూస్’, ఇక్బాల్, ధనక్ సినిమాలతో పేరుతెచ్చుకున్న నగేశ్ ఈ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా జరిగిందని, లాక్ డౌన్ వల్ల పనులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రావ్యా శర్మ సహ నిర్మాతగా వ్యహరిస్తున్నారు.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News