బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా వీళ్లలో ఎవరు..?

జూ.ఎన్టీఆర్ బిగ్ బాస్ సెకండ్ సీజన్ కి వ్యాఖ్యాతగా ఉండరు అనే వార్తలు గతకొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.

Last Updated : Feb 20, 2018, 10:40 AM IST
బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా వీళ్లలో ఎవరు..?

జూ.ఎన్టీఆర్ బిగ్ బాస్ సెకండ్ సీజన్ కి వ్యాఖ్యాతగా ఉండరు అనే వార్తలు గతకొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం త్రివిక్రమ్-రాజమౌళి ప్రాజెక్టులకు డేట్స్ ఇవ్వడమేనట. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది.  

దాదాపు ఎన్టీఆర్ 'బిగ్ బాస్ షో' కు రాకపోవచ్చు అని షో నిర్వాహకులు భావించి.. ఇతర హీరోలను వెతికే పనిలో పడ్డారు. ఎన్టీఆర్ స్థాయి ఇమేజ్ ఉన్న స్టార్ ని తీసుకురావాలని యోచిస్తున్నారు.

ఈక్రమంలో, బన్నీ అయితే బెస్ట్ అని అనుకుంటున్నారు. దాదాపు ఖరారు అయినట్టే అని టాక్. అలానే, షో నిర్వాహకులు నాని వైపు కూడా మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. బన్నీ రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది. అయితే తారక్ స్థాయిలో పేరుంది కాబట్టి సెట్ అవుతాడని అనుకుంటున్నారు. ఇక నాని విషయానికి వస్తే, నెగిటివ్ టాక్ లేని హీరోల్లో నాని టాప్ లో ఉన్నాడు. అదీకాక, ఐఫా వంటి వేడుకల్లో హోస్ట్ గా వ్యవహరించారు. అయితే అభిమానులు మాత్రం..అల్లు, నానియే కాకుండా..  రామ్ చరణ్, రానా హోస్ట్ చేసినా బాగుంటుంది అంటున్నారు. మరి వీరిలో ఎవరు బిగ్ బాస్ 2 హోస్ట్  అవుతారో చూడాలి.  

Trending News