నాతో అశ్లీలంగా ప్రవర్తించాడు : మహిళా కొరియోగ్రాఫర్

బాలీవుడ్ లో ఓ వింత సంఘటన తారాస్థాయికి చేరింది. మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపిస్తూ .. తనకు కమిషన్ ఇవ్వాలని బెదిరించడమే కాకుండా పోర్న్ వీడియోలు చూడాలంటూ ఒత్తిడి చేశాడంటూ ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై మహిళా కొరియోగ్రాఫర్ మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు, అంబోలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.   

Updated: Jan 28, 2020, 08:00 PM IST
నాతో అశ్లీలంగా ప్రవర్తించాడు : మహిళా కొరియోగ్రాఫర్

ముంబై: బాలీవుడ్ లో ఓ వింత సంఘటన తారాస్థాయికి చేరింది. మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపిస్తూ .. తనకు కమిషన్ ఇవ్వాలని బెదిరించడమే కాకుండా పోర్న్ వీడియోలు చూడాలంటూ ఒత్తిడి చేశాడంటూ ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై మహిళా కొరియోగ్రాఫర్ మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు, అంబోలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్(ఐఎఫ్‌టిసిఎ) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత గణేష్ ఆచార్య, తరచుగా రమ్మని పిలిచేవాడని తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. సినిమా పాటలకు కొరియోగ్రాఫ్ చేసేందుకు డ్యాన్సర్లను సమన్వయపరిచే వృత్తిలో ఉన్న తనను డ్యాన్సర్‌కు రూ. 500 చొప్పున కమిషన్ చెల్లించాలని ఆచార్య డిమాండు చేసే వాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. నిరాకరించడంతో తనకు బాలీవుడ్‌లో పని లేకుండా చేశాడని ఆమె తెలిపింది. 

తనతో అసభ్యంగా మాట్లాడుతూ, అసిస్టెంట్‌గా పనిచేయమని ఒత్తిడి చేశాడని, నేను దానికి ఒప్పుకోలేదని ఆమె వివరించింది. తాను గణేష్ ఆచార్య ఆఫీసుకు వెళ్లినప్పుడల్లా అతను పోర్న్ వీడియోలు చూస్తూ కనిపించేవాడని, తనను కూడా వాటిని చూడాలంటూ బలవంతం పెట్టేవాడని ఆమె ఆరోపించింది. అతను స్త్రీలోలుడేకాక జూదం, క్రికెట్ బెట్టింగ్ వంటివి కూడా చేసేవాడని ఆమె ఆరోపించింది. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు గణేష్ ఆచార్యపై ఫిర్యాదు చేసేందుకు తాను ఐఎఫ్‌టిసిఎ ఆఫీసుకు వెళ్లగా అక్కడకు జయశ్రీ కేల్కర్, ప్రీతి లాడ్‌తో కలసి ఆచార్య వచ్చాడని, తనను దుర్భాషలాడుతూ వారంతా చేయిచేసుకున్నారని ఆమె ఆరోపించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..